ఇటీవల మలయాళీ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన సినిమా ప్రేమలు. యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. యంగ్ హీరో నెస్లెన్ కె గపూర్, మ్యాథ్యూ థామస్, మమితా బైజు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ భారీగా వసూళ్లు రాబట్టింది. రొమాంటిక్-కామెడీ చిత్రంగా రూపొందిన ఈ సినిమాను దాదాపు రూ.10 కోట్లతో భావనా స్టూడియోస్ బ్యానర్ పై ఫహద్ ఫాజిల్, దిలీప్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా దాదాపు రూ. 130 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తీకేయ తెలుగులోకి రిలీజ్ చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ మూవీ గత అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. శుక్రవారం ఏప్రిల్ 12 నుంచి ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే మలయాళం, తమిళం, హిందీ భాషల్లో ఈసినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే ఆహాలో అందుబాటులో ఉంది. ప్రేమలు చిత్రానికి గిరీష్ ఎడి రచన, దర్శకత్వం వహించారు. శ్యామ్ మోహన్, అఖిలా భార్గవన్, సంగీత ప్రతాప్ , అల్తాఫ్ సలీం, మీనాక్షి రవీంద్రన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళీ సినిమాగా ప్రేమలు నిలిచింది.
హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ యూవతను ఎక్కువగా ఆకట్టుకుంది. ఈ మూవీలో రీను పాత్రలో నటించిన హీరోయిన్ మమితా బైజుకు మరింత ఫాలోయింగ్ వచ్చేసింది. ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో మమితా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇన్నాళ్లు థియేటర్లలో ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మిస్ అయిన వారు ఇప్పుడు నేరుగా ఓటీటీల్లోనే చూసి ఎంజాయ్ చేయొచ్చు.
Most awaited #Premalu is now streaming!❤️https://t.co/BGzFJsd5hA
— ahavideoin (@ahavideoIN) April 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.