
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ.. ఇలా స్టార్ హీరోలు గతంలో నటించిన సూపర్ హిట్ సినిమాలు మళ్లీ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. కలెక్షన్లు కూడా బాగానే వస్తుండడంతో నిర్మాతలు కూడా రీ రిలీజులపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘సినిమా రిలీజులు థియేటర్లలోనే ఉంటాయా ఏంటి? మా ఓటీటీలోనూ దింపుతున్నాం’ అంటూ ప్రముఖ తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ఆహా సరికొత్త ట్రెండ్‌ను స్టార్ట్ చేసింది. తమ ఓటీటీ వేదికగా సూపర్ హిట్ సినిమాలను ప్రీమియం క్వాలిటీస్‌తో రీ రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించింది. మొదటి సినిమాగా అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ నిర్మాణంలో తెరకెక్కిన మగధీరను ఓటీటీలో రీ రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. రామ్ చరణ్- రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీని నవంబర్ 3న ఓటీటీలో రీ రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది ఆహా.
ఇక మగధీర తర్వాత మహేశ్ బాబు ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమా అతడును కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్నారు. నవంబర్ 10న ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఆపై నవంబర్ 17న మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా ‘ఘరానా మొగుడు’ని రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ రీ రిలీజుల ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా? మరికొన్ని సూపర్ హిట్ సినిమాలు డిజిటల్ రీ రిలీజ్‌కు వస్తాయా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
Ee, Re-Release lu Theater lone untaya enti..?😜
Mana aha lonu dimputhunnam..😎#Rerelease #magadheera #athadu #gharanamogudu #MaheshBabu𓃵 #Chiranjeevi #RamCharan𓃵 #MegastarChiranjeevi #Megastar pic.twitter.com/JSmj0gEUbM— ahavideoin (@ahavideoIN) October 27, 2023
Re-Release lu Theater lone untaya enti..?😜#Magadheera Premieres Nov 3 #AiranevanchalaEnti #Magadheera pic.twitter.com/xnbfxhx1jB
— ahavideoin (@ahavideoIN) October 28, 2023
Experience a story that’s both Entertaining & Emotionally touching. #Mattikatha is now available on @ahavideoIN#Mattikatha #AhaVideoIn #WatchNow
▶️https://t.co/h4oKkWQ8cz@Appireddya @ajeyved @Mic_Movies @Mictvdigital@smaransai @Pa1Kadiyala @itsbalveersingh pic.twitter.com/DU46BElPMc
— Mic Movies (@Mic_Movies) October 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..