ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో చేతబడులు, మూడ నమ్మకాల నేపథ్యంలో వచ్చే హారర్ చిత్రాలు సూపర్ హిట్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన విరూపాక్ష సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే నటుడు సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పొలిమేర 2. గతంలో 2021లో వచ్చిన మా ఊరి పొలిమేర చిత్రానికి సిక్వెల్‌గా ఈ మూవీని అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమాకు డైరెక్ట్ర అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించగా.. బాలదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను కీలకపాత్రలు పోషించారు. పోస్టర్స్, ట్రైలర్‌తో ఆసక్తి రేకెత్తించిన ఈ మూవీ నవంబర్ 3న విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఫస్ట్ పార్ట్ ను మించిన ట్విస్టులతో ప్రేక్షకులను మరింత థ్రిల్ ఫీల్ చేసింది. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో మరోసారి తన నటనతో ప్రశంసలు అందుకున్నాడు నటుడు సత్యంరాజేష్.
థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో ఈ మూవీ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈరోజు కేవలం ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ రేపటి నుంచి ఆహాలో అందరికి అందుబాటులో ఉంటుంది ఈ మూవీ. ఇప్పటివరకు థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ వేదికగా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
Pooja konchem early ga start cheddam!🤨
ఆవాహాయామి…ఆవాహయామీ!!☠️☠️#Polimera2 Streaming Now for #ahaGold Subscribers.▶️https://t.co/EjVZhew7vD@Satyamrajesh2 #kamakshiBhaskarla @DrAnilviswanath @Connect2vamsi @Gowrkriesna @getupsrinu3 pic.twitter.com/12GJ0woPj2
— ahavideoin (@ahavideoIN) December 6, 2023
డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన మొదటి పార్ట్ మా ఊరి పొలిమేర చిత్రం అడియన్స్ ఊహించని ట్విస్టులతో అదిరిపోయింది. అప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ సూపర్ హిట్ అయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా అడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా చివర్లో ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్టులను పెట్టి సీక్వెల్ ఉందని హిట్ ఇచ్చారు. ఇక నవంబర్ 3న ఈ సినిమా సెకండ్ పార్ట్ రిలీజ్ చేసి అంతకు మించిన ట్విస్టులు, సస్పెన్స్ తో ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.
రా ఇటుగ రా పిడుగులా… Mind-Bending Blockbuster #Polimera2 vachestondi, oohinchani twist la tho on aha on 08 Dec.
24 hours early access to aha Gold subscribers@Satyamrajesh2 #kamakshiBhaskarla @DrAnilviswanath @Connect2vamsi @Gowrkriesna @getupsrinu3 pic.twitter.com/OvFCbbZPNo
— ahavideoin (@ahavideoIN) December 1, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.