
ఆగస్టు నెలకు సంబంధించి పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు వచ్చాయి. మొదటి వారంలో నాగశౌర్య రంగబలి, పరేషాన్, భాగ్ సాలే సినిమాలతో పాటు జేడీ చక్రవర్తి దయా వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. కాగా ఈ నెలలో మరికొన్ని హిట్ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్కు రానున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అశ్విన్ నటించిన హిడింబ. నందిత శ్వేత హీరోయిన్గా నటించింది. ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా విడుదలైన ఈ చిత్రం థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. అలాగే రెట్రో క్రైమ్ కామెడీగా రూపొందిన అన్నపూర్ణ ఫొటో స్టూడియో కూడా ఈనెలలోనే ఓటీటీలో రిలీజ్ కానుంది. చైతన్య రావు, లావణ్య జంటగా నటించారు. పల్లెటూరి ప్రేమకథకు క్రైమ్ నేపథ్యాన్ని జోడించి రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. వీటితో పాటు ఈ ఆగస్టులో ఓటీటీలో రానున్న సినిమాలు, సిరీస్‌లపై ఒక లుక్కేద్దాం రండి.
1. హిడింబ- ఆహా- ఆగస్టు 10
2. పోర్ తోడిల్- సోనీలివ్- ఆగస్టు 11
3. అన్నపూర్ణ ఫొటో స్టూడియో- ఈటీవీ విన్- ఆగస్టు 15
4. విజయ్ ఆంటోని హత్య- అమెజాన్ ప్రైమ్ – ఆగస్టు 20
పై సినిమాలతో పాటు ప్రభాస్ ఆదిపురుష్ కూడా ఆగస్టులోనే ఓటీటీ రిలీజ్ కావొచ్చునని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా ఈనెల మూడో వారంలో ఈ మైథలాజికల్ మూవీ రిలీజ్ అవుతుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబి చిత్రం కూడా ఈనెలాఖరులో ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. అలాగే ఏజెంట్, రామబాణం మూవీస్ ఓటీటీ రిలీజ్‌పై అప్డేట్స్ రావాల్సి ఉంది. వీటితో పాటు పలు వివిధ భాషల్లో రిలీజైన సినిమాలు, సిరీస్ లు కూడా ఓటీటీల్లోకి అందుబాటులోకి రానున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..