
ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాల సందడి బాగానే ఉండనుంది. అల్లరి నరేశ్ ’12ఏ రైల్వేకాలనీ’, ప్రియదర్శి ‘ప్రేమంటే’, రాజు వెడ్స్ రాంబాయి, ఇట్లు మీ ఎదవ, పాంచ్ మినార్, ప్రేమలో రెండోసారి, కలివనం ఇలా పలు తెలుగు సినిమాలు థియేటర్లలో అడుగు పెట్టనున్నాయి. అలాగే మఫ్టీ పోలీస్, ద ఫేస్ ఆఫ్ ద ఫేస్‌లెస్ అనే డబ్బింగ్ మూవీస్ కూడా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ దాదాపు 20కు పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది తమిళ హిట్ సినిమా ‘బైసన్’. ధ్రువ్ విక్రమ్ నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ కురానుంది. అలాగే కాంట్రవర్సీ చిత్రం ‘ద బెంగాల్ ఫైల్స్’, ది మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 3 కూడా ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.
Kabaddi nammuluku vena oru game ah irukalam, aana Kittanukku adhaan life eh 🔥💪 pic.twitter.com/DeZoMlOG5l
— Netflix India South (@Netflix_INSouth) November 17, 2025
Note: ఇవి కాక వారం కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.