OTT Movies: ఈ వారం ఓటీటీల్లో సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు.. ఈ నాలుగు మాత్రం చాలా స్పెషల్

ఈ వారం ఓటీటీల్లో పలు సూపర్ హిట్ సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ముఖ్యంగా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన ధురందర్ మూవీ ఈ వారంలోనే స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ అవకాశముంది. దీంతో పాటు..

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు.. ఈ నాలుగు మాత్రం చాలా స్పెషల్
OTT Movies

Updated on: Jan 27, 2026 | 7:45 AM

ప్రస్తుతం థియేటర్లలో ఇంకా సంక్రాంతి సినిమాల సందడే కనిపిస్తోంది. అందుకే ఈ వారంలో కూడా పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. తరుణ్ భాస్కర్, ఇషాల ఓం శాంతి శాంతి శాంతిః, త్రిముఖ, ప్రేమకడలి వంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే విజయ్ సేతుపతి ‘గాంధీ టాక్స్’, ‘తుంబాడ్’ డైరెక్టర్ కొత్త చిత్రం ‘మయసభ’ కూడా ఈ వారాంతంలోనే బిగ్ స్క్రీన్ పై రానున్నాయి. అయితే ఓటీటీల్లో ఈ వారం మాత్రం పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ధురందర్ మూవీ గురించి. థియేటర్లలో రూ. 1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ మూవీ ఈ వారంలోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుందనే టాక్ ఉంది. అలాగే రోషన్ ఛాంపియన్, నివిన్ పౌలి సర్వం మాయ, పతంగ్ చిత్రాలు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు పలు భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం రండి

 

నెట్‌ఫ్లిక్స్

ఇవి కూడా చదవండి

మైక్ ఎప్స్: డెల్యూషనల్ (ఇంగ్లిష్ సినిమా) – జనవరి 27

టేక్ దట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జనవరి 27

బ్రిడ్జర్‌టన్ సీజన్ 4 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జనవరి 29

ఛాంపియన్ (తెలుగు సినిమా) – జనవరి 29

ధురంధర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జనవరి 30 (రూమర్ డేట్)

మిరాకిల్: ద బాయ్స్ ఆఫ్ 80స్ (ఇంగ్లిష్ సినిమా) – జనవరి 30

అమెజాన్ ప్రైమ్ వీడియో

ద రెకింగ్ క్రూ (ఇంగ్లిష్ సినిమా) – జనవరి 28

దల్ దల్ (హిందీ సిరీస్) – జనవరి 30

జియో హాట్‌స్టార్

గుస్తాక్ ఇష్క్ (హిందీ మూవీ) – జనవరి 27

సర్వం మాయ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జనవరి 30

 

సన్ నెక్స్ట్

పతంగ్ (తెలుగు సినిమా) – జనవరి 30

ఆపిల్ టీవీ ప్లస్

స్క్రింకింగ్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జనవరి 28

యో గబ్బా గబ్బా ల్యాండ్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జనవరి 30

బుక్ మై షో

ద ఇంటర్న్‌షిప్ (ఇంగ్లిష్ మూవీ) – జనవరి 28

జీ5

దేవ్‌కెళ్ (మరాఠీ వెబ్ సిరీస్) – జనవరి 30

 

Note: ఇవి కాక వారం  కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.