శ్రీ విష్ణు నటించిన రాజరాజ చోర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది కోలీవుడ్ హీరోయిన్ సునైనా. కెరీర్ ప్రారంభంలో టెన్త్ క్లాస్ వంటి, సమ్ థింగ్ స్పెషల్ వంటి సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. తాజాగా సునైనా నటించిన చిత్రం రెజీనా. డొమిన్ డిసిల్వా తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో అనంత్‌నాగ్, వివేక్ ప్రసన్న, నివాస్ ఆదితన్ కీలక పాత్రలు పోషించారు. జూన్ 23న థియేటర్లలో విడుదలైన రెజీనా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో ఒక యువతి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్న ఆసక్తికర కథనంలో ఈ సినిమాను రూపొందించారు. పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన రెజీనా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఎప్పటిలాగే సునైనా నటన హైలెట్‌గా నిలిచింది. మరి థియేటర్లలో పెద్దగా ఆడని రెజీనా సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. అది కూడా రెండు ప్లాట్‌ఫామ్స్‌లో. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ రెజీనా స్ట్రీమింగ్ అవుతోంది.
కాగా తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ రెజీనా సినిమా అందుబాటులో ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే అదేమీ జరగలేదు. ప్రస్తుతం తమిళ్‌లో మాత్రమే రెజీనా సినిమా అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ కావొచ్చని తెలుస్తోంది. ఎల్లో బేర్ ప్రొడక్షన్ బ్యానర్‌పై సతీష్ నాయర్ రెజీనా సినిమాను నిర్మించారు. ఆయనే స్వరాలు కూడా సమకూర్చారు.
STREAMING ALERT#Regina [2023] now Streaming On @PrimeVideoIN & @ahatamil in #Tamil Language.@TheSunainaa @domin_dsilva @SathishNair20 @yellowbearprod#Sunainaa #reginamovie #ahatamil #Bollywood #ReginaOnAha
Follow For Updates @OTTChats pic.twitter.com/OLdsHhHj2o
— OTT Chats (@OTTChats) July 25, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.