OTT Movie: వణుకు పుట్టించే ట్విస్టులు, మెంటలెక్కించే హారర్ మూవీ.. అస్సలు మిస్ అవ్వకండి..

|

Oct 30, 2024 | 3:16 PM

సాధారణంగా హారర్ సినిమాలు ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి. కొందరు హారర్ మూవీ లవర్స్ మాత్రం ఓవైపు భయపడుతూనే మరోవైపు అలాంటి సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా ఓటీటీ సినీ ప్రియుల కోసం హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఎక్కువగా స్ట్రీమింగ్ చేస్తున్నారు మేకర్స్. కానీ మీకు తెలుసా.. హారర్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వొద్దు.

OTT Movie:  వణుకు పుట్టించే ట్విస్టులు, మెంటలెక్కించే హారర్ మూవీ.. అస్సలు మిస్ అవ్వకండి..
Ott Movie
Follow us on

ఇటీవల కొన్నాళ్లుగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఇతర భాషల డబ్బింగ్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హారర్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. భారతీయ సినిమాలతోపాటు.. హాలీవుడ్ సినిమాలకు కూడా అంతే స్థాయిలో ఆదరణ లభిస్తోంది. హారర్, క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్ సినిమాల వంటి సినిమాలను చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆద్యంతం వణుకుపుట్టించే సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీస్ చూసేందుకు ప్రేక్షకులు రెడిగా ఉంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు జనాల్లో మంచి ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే ప్రేక్షకులను ఉర్రూతలూగించే థ్రిల్లర్ మూవీ ఇప్పుడు జనాలు అస్సలు మిస్ కావొద్దు. ఇంతకీ ఏ సినిమా అనుకుంటున్నారా..? అదే యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “ఎ క్వైట్ ప్లేస్: డే వన్”.

గత జూలైలో హారర్ జానర్‌లో విడుదలైంది. ఈ హాలీవుడ్ హారర్ మూవీకి ప్రముఖ దర్శకుడు మైఖేల్ సర్నోస్కీ దర్శకత్వం వహించారు.ఇప్పటికే ఈ సినిమా రెండు భాగాలు విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ రెండు భాగాలకు కొనసాగింపుగా ఈ మూడో భాగం “యా క్వైట్ ప్లేస్ డే వన్” వస్తుంది. ఈ చిత్రం “అమెరికన్ అపోకలిప్టిక్” ఆధారంగా రూపొందించబడిన సైన్స్ ఫిక్షన్ హారర్ చిత్రం. ఇది బుక్‌స్టోర్ ఆధారంగా తీసిన సినిమా. ఈ చిత్రంలో ఒక అదృశ్య గ్రహాంతర జీవి సాధారణంగా ఉన్న అమెరికన్ పట్టణంలో ప్రజలను చంపడానికి దాని వినికిడిని ఉపయోగిస్తుంది. ఈ చిత్రం ఆద్యంతం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో నటులు జోసెఫ్ క్విన్, డిజిమోన్ హౌన్సౌ కీలకపాత్రలు పోషించారు.

జూలై 26, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ “అమెజాన్ ప్రైమ్”లో 10కి 7 ఆన్‌లైన్ రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ థ్రిల్లర్ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.