
సస్పెన్స్ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామాలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఈ జానర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా కథ, విజువల్స్, ఊహించని క్లైమాక్స్ ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేస్తుంది. జూలై 2021లో విడుదలైన ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇందులో ప్రధాన నటీనటుల యాక్టింగ్, అద్భుతమైన సంగీతం చాలా కాలంగా సినీప్రియులకు చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమా పేరు హసీన్ దిల్రుబా. ఇందులో తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ రాణే, ఆశిష్ వర్మ, అదితి చౌహాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వినీల్ మాథ్యూ దర్శకత్వం వహించగా, కనికా ధిల్లాన్ కథ అందించారు. ఈ సినిమాలో ఊహించని ట్విస్టులు.. ఆద్యంతం ఊత్కంఠభరితంగా సాగే కథ ప్రేక్షకులను సీటులో నుంచి కదలనివ్వదు.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
తాప్సీ పన్నూ, విక్రాంత్ మాస్సే అద్భుతమైన నటన, హర్షవర్దన్ పవర్ ఫుల్ యాక్టింగ్ సినిమాకు మరో హైలెట్ అయ్యాయి. అలాగే ఆద్యంతం ఊత్కంఠ, భావోద్వేగాల సమతుల్యత ఈ చిత్రానికి మరో హైలెట్. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం మిమ్మల్ని ఆద్యంతం కట్టిపడేస్తుంది. అలాగే ఈ మూవీ క్లైమాక్స్ మిమ్మల్ని పూర్తిగా ఆశ్చర్యపరుస్తుంది. అందుకే జనాలు ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. దాదాపు 2 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌ను కలిగి ఉన్న ఈ సినిమా IMDbలో 6.9 రేటింగ్ ఉంది.
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..
కథ విషయానికి వస్తే.. ఈ కథ రాణి, రిషుతో ప్రారంభమవుతుంది. వీరిది పెద్దలు కుదుర్చిన వివాహం. కానీ పెళ్లి తర్వాత వారి జీవితాలు మారిపోతాయి. దీంతో ఇద్దరి మధ్య బంధం చెదిరిపోతుంది. ఆ తర్వాత రాణి జీవితంలోకి నీల్ ప్రవేశిస్తాడు. నీల్ రాక కథలో అనేక ఊహించని మలుపులు తెస్తుంది. తరువాత ఒక హత్య కేసు బయటపడి, ప్రతిదీ క్లిష్టతరం చేస్తుంది. నిజమైన హంతకుడు ఎవరని అందరూ ఆశ్చర్యపోతారు. సినిమా ముగింపు చాలా షాకింగ్‌గా ఉంటుంది.
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..