
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. అందాల అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం కార్తికేయ 2 (Karthikeya 2). డైరెక్టర్ చందూ మోండేటి తెరకెక్కించిన ఈ సినిమా హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఆగస్ట్ 13న విడుదలైన ఈ సినిమా సౌత్, నార్త్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఉత్తరాది నుంచి ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో నార్త్‌లోనూ నిఖిల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై.. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది కార్తికేయ 2. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అని ఎదురుచూస్తున్నారు సినీప్రియులు. ఈ క్రమంలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.
లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైనట్లుగా వినికిడి. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ స్టూడియోస్ భారీ ధరకు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక త్వరలోనే జీ5లో కార్తికేయ 2 స్ట్రీమింగ్ కానుందట. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఇప్పటివరకు అప్డేట్ రాలేదు.. కానీ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సెప్టెంబర్ 30 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. నిఖిల్, అనుపమ జంటగా నటించిన 18 పేజేస్ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.