OTT Movie: ఇదేం ట్విస్ట్‌.. అప్పుడే ఓటీటీలో కార్తీ కొత్త సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. అధికారిక ప్రకటన

కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వా వాత్తియార్‌’. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. అయితే ఈ సినిమాను 'అన్నగారు వస్తారు' పేరుతో తెలుగులోకి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ థియేటర్స్‌ దొరకకపోవడంతో టాలీవుడ్‌లో విడుదల కాలేదు.

OTT Movie: ఇదేం ట్విస్ట్‌.. అప్పుడే ఓటీటీలో కార్తీ కొత్త సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. అధికారిక ప్రకటన
Annagaru Vastharu Movie

Updated on: Jan 27, 2026 | 6:25 PM

తమిళ స్టార్ కార్తీ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా ‘వా.. వాతియార్’. దర్శకుడు నలన్‌ కుమారస్వామి తెరకెక్కించిన ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. పలు సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ లు ఆసక్తికరంగా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు మంచిగానే ఉన్నాయి. అయితే విడుదల తరువాత మాత్రం అంతగా రెస్పాన్స్ రాలేదు. స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా నీరసంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇదే సినిమాను ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్ తో తెలుగులో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ సంక్రాంతి సమయంలో థియేటర్స్ దొరక్క పోవడంతో తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదల కాలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాను డైరెక్టుగా ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు, కన్నడం, హిందీ, మలయాళం భాషల్లో కార్తీ సినిమాను స్ట్రీమింగ్ కు రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

‘అన్నగారు వస్తారు’ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ మేరకు
జనవరి 28 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ సినిమాలో సత్యరాజ్, రాజ్‌కిరణ్,  నిళల్‌గళ్ రవి, ఆనందరాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్, జి.ఎం. సుందర్, మధుర్ మిట్టల్ వడివుక్కరసి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. మరి థియేటర్స్ లో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

రేపటి నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అన్నగారు వస్తారు స్ట్రీమింగ్..

తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.