Satyam Sundaram OTT: దీపావళి కన్నా ముందే ఓటీటీలో సత్యం సుందరం.. కార్తీ సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

|

Oct 19, 2024 | 2:58 PM

ముందుగా దీపావళి పండగ కానుకగా ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని భావించారు. అయితే ఇప్పుడు ఒక వారం ముందే సత్యం సుందరం సినిమా స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది. 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ మూవీలో కార్తీ హీరోగా నటించగా, అరవింద్ స్వామీ మరో కీలక పాత్రలో కనిపించారు.

Satyam Sundaram OTT: దీపావళి కన్నా ముందే ఓటీటీలో సత్యం సుందరం.. కార్తీ సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Satyam Sundaram Movie
Follow us on

 

ఎన్టీఆర్ దేవర బరిలో ఉన్నా పోటీగా రిలీజైన సినిమా సత్యం సుందరం. తెలుగు ఆడియెన్స్ కు బాగా తెలిసిన కార్తీ ఇందులో హీరోగా నటించాడు. అలాగే రోజా ఫేమ్ అరవింద్ స్వామి మరో కీలక పాత్రలో మెరిశాడు. 96 వంటి క్లాసిక్ లవ్ స్టోరీని తీసిన ప్రేమ్ కుమార్ ఈ ఫీల్ గుడ్ మూవీని తెరకెక్కించాడు. తమిళంలో మైయళగన్ పేరుతో రిలీజ్ చేయగా, తెలుగులో మాత్రం సత్యం సుందరం పేరుతో ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చారు. దేవర రిలీజ్ తర్వాత మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజైన సత్యం సుందరం సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. చూసినోళ్లందరూ ఈ మూవీని మెచ్చుకున్నారు. రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. అయితే బరిలో ఎన్టీఆర్ దేవర ఉండడంతో చాలా మంది ఈ సూపర్బ్ సినిమాను చూడలేకపోయారు. అలాంటి వారి కోసం సత్యం సుందరం ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.  అక్టోబర్ 25 నుంచే ఈ ఫీల్ గుడ్ మూవీ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చే యోచనలో ఉన్నారని సమాచారం. తమిళంతో పాటు తెలుగులోనూ ఇదే రోజు కార్తీ సినిమా స్ట్రీమింగ్ కు రానుందని టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

 

సత్యం సుందరం సినిమా విషయానికొస్తే.. ఓ రాత్రిలో జరిగే కథతో దీన్ని అద్భుతంగా తెరకెక్కించారు ప్రేమ్ కుమార్. సత్యం (అరవింద స్వామి) అనే వ్యక్తి కొన్ని పరిస్థితుల వల్ల సొంతూరిని వదిలిపెట్టి వెళ్లిపోతాడు. చిన్నాన్న కూతురు పెళ్లి కోసం దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత అదే ఊరికి తిరిగి వస్తాడు. ఆ పెళ్లిలో సుందరం (కార్తి) బావ అని తనని తాను పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి ప్రయాణం ఎలా సాగిందన్నదే సినిమా. కామెడీతో పాటు ఎమోషనల్ గా ఈ సత్యం సుందరం సినిమాను అసలు మిస్ అవ్వద్దు..

సత్యం సుందరం సినిమాలో కార్తీ, అరవింద్ స్వామి..

సత్యం సుందరం సినిమా ట్రైలర్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.