
ప్రస్తుతం ఓటీటీల్లో తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, తమిళ్, మలయాళ భాషలకు చెందిన వెబ్ సిరీస్‌లు ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి. అయితే కన్నడలో మాత్రం వెబ్ సిరీస్ లు రావడం చాలా అరుదు. అయితే ఇటీవల విడుదలైన ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మాత్రం ఓటీటీని షేక్ చేసింది. అతి తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ సాధించిన కన్నడ వెబ్ సిరీస్ గా రికార్డుల కెక్కింది. ఏప్రిల్ 25న ఓ ప్రముఖ ఓటీటీలోకి వచ్చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అతి తక్కువ కాలంలోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను చేరుకుంది. ఒక రీజినల్ వెబ్ సిరీస్ ఈ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుందంటే మాములు విషయం కాదు. కన్నడతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ సంచలన విజయం సాధించింది. ఇప్పుడీ గ్రిప్పింగ్ ఫ్యామిలీ థ్రిల్లర్ తెలుగులోకి కూడా అందుబాటులోకి వచ్చేసింది. శుక్రవారం (మే16) అర్ధరాత్రి నుంచే ఈ సిరీస్ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. బెంగళూరులోని చిక్ మంగళూర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.
మంచి భర్త లభించాడనే సంతోషంతో, ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన కొత్త పెళ్లి కూతురుకి మొదటి రోజునే ఊహించని సంఘటన ఎదురవుతుంది. ఆ ఇంట్లో అందరూ తేడాగా ప్రవర్తిస్తారు. అంతే కాదు తనకంటే ముందుగా ఆ ఇంటికి కోడళ్లుగా వచ్చిన వాళ్లంతా చచ్చిపోయారని తెలుస్తుంది. మరి ఆ కోడళ్ల చావులకు కారణమెవరు? ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? కొత్తగా వచ్చిన కోడలికి ఎదురైన పరిస్థితులేంటి? అన్నది తెలుసుకోవలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
Just watched #AyyanaMane on #ZEE5! A gripping Kannada thriller that masterfully blends mystery, superstition, and family secrets. Kushee Ravi’s compelling performance as Jaaji make it a must-watch! #KannadaWebSeries #AyyanaManeOnZEE5@kusheeravi pic.twitter.com/rAd6oCCqAx
— Jatre Talks (@JatreTalks) April 26, 2025
ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వెబ్ సిరీస్ పేరు అయ్యనా మానే. దీని అర్థం అయ్యగారి ఇల్లు. ప్రస్తుతం ఓటీటీలో ఉన్న ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకూ ఈ సిరీస్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రస్తుతం జీ5 ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
At Ayyana Mane, love and life are haunted by death. #AyyanaMane streaming now on #ZEE5#ZEE5Global #AyyanaManeOnZEE5@archana_kottige @Hithaceee @KusheeRavi @shrunaidu @ManasiSudhir1 @RJPRADEEPA @Anirudhacharya @ZEE5Kannada #VijayShobharajPavoor @kaanistudio… pic.twitter.com/X1HPhnnUcy
— ZEE5 Global (@ZEE5Global) April 28, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి