అసలే జూన్ నెల… ఆపై థియేటర్లు లేవు..! పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అలమటిస్తున్న డిజిటల్ ఆడియన్స్ కోసం పసందైన వంటకాల్ని సిద్ధం చేశాయి ఓటీటీ కంపెనీలు. కిమ్స్ కన్వీనియన్స్, లోకీ, స్వీట్‌టూత్ లాంటి గ్లోబల్ ఒరిజినల్స్‌ని అటుంచితే.. లోకల్ కంటెంట్ కూడా భేషుగ్గా వుంది. జూన్‌నెలలో మాతో ఎంటర్‌టైన్‌మెంట్ మామూలుగా వుండదు అంటున్నాయి డిజిటల్ డయాస్‌లు.
ధనుష్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘జగమే తంత్రం’ మూవీ ఈనెల 18న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ సీజన్‌లో డైరెక్ట్‌గా డిజిటల్ ఆడియన్స్‌కి అలరించబోతున్న తొలి మేజర్ మూవీ ఇదే. ఆహాలో కూడా తెలుగు సినిమాల సందడి జోరందుకుంది. టొవినోథామస్ మూవీ కాలా తెలుగు వెర్షన్ 4న ఆహాలో రిలీజవుతోంది. అటు.. షియో ఎమోషనల్ మూవీ ‘అర్థశతాబ్దం’… ఈనెల 11న ఆహాలోనే స్ట్రీమింగ్‌కి రెడీ అవుతోంది.
రీసెంట్‌గా థియేటర్లో రిలీజైన ‘రంగ్ దే’ డిజిటల్ రిలీజ్ కోసం జూన్12ను లాక్ చేసుకుంది. గతంలో లెజెండరీ మేథమెటిషియన్ శకుంతలాదేవిగా ఓటీటీ ఆడియన్స్‌ని అలరించిన విద్యాబాలన్… ఈసారి మరో జానర్‌తో వచ్చేశారు. విద్యాబాలన్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా నటించిన ‘షేర్నీ’ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఈనెల 18న డైరెక్ట్ రిలీజ్ కాబోతోంది. ఇక.. ఒరిజినల్స్‌తో కూడా జూన్ నెలను థిక్కెస్ట్ సీజన్‌గా మార్చేస్తున్నాయి ఓటీటీ కంపెనీలు. ఎన్నోరోజులుగా వెయిటింగ్‌లో వున్న ఫ్యామిలీమేన్ సిరీస్ రెండో సీజన్ ఈనెల 4నే ప్రైమ్ వీడియోలో ప్రత్యక్షం కాబోతోంది. ఈసారి సమంత ఎలిమెంట్ ఈ సిరీస్‌ని సూపర్‌గా డ్రైవ్ చేసే ఛాన్సుంది. సునీల్ గ్రోవర్ లీడ్‌రోల్‌లో నటించిన కామెడీ థ్రిల్లర్ ‘సన్‌ఫ్లవర్’ జీ5లో ఈనెల 11న స్ట్రీమింగ్ అవుతోంది. ఒక మిడిల్ క్లాస్ హౌసింగ్ సొసైటీలోని కొన్ని క్యారెక్టర్ల చుట్టూ అల్లిన సన్‌ఫ్లవర్… రిలీజ్‌కి ముందే మంచి హైప్ తెచ్చుకుంది.
తెలుగు డిజిటల్ ఆడియన్స్‌కి ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్‌నిచ్చే ఆహా యాప్ కూడా ‘ఇన్‌ది నేమ్ ఆఫ్ గాడ్’ పేరుతో నయా ఒరిజినల్‌ని సిద్ధం చేసింది. ప్రియదర్శి తొలిసారిగా రా అండ్ రస్టిక్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌పై టైటిల్‌తోనే బజ్ క్రియేటైంది. జూన్‌లోనే స్ట్రీమ్ కాబోతోంది ‘ఇన్‌దినేమ్ ఆఫ్ గాడ్’. ఇదీ క్లుప్తంగా జూన్ మాసంలో.. ఓటీటీ వినోదాల సందడి.