OTT Movie: కూతురి హత్యకు రివేంజ్.. ఓటీటీలో దృశ్యం దర్శకుడి మరో క్రైమ్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్ మూవీ

దృశ్యం మూవీ డైరెక్టర్ జీతూ జోసెఫ్ రూపొందించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో రిలీజైంది. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. సుమారు గంటల 15 నిమిషాల నిడివి గల ఈ సినిమాలో ఊహించని ట్విస్టులు చాలా ఉన్నాయి.

OTT Movie: కూతురి హత్యకు రివేంజ్.. ఓటీటీలో దృశ్యం దర్శకుడి మరో క్రైమ్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్ మూవీ
OTT Movie

Updated on: Mar 25, 2026 | 8:16 PM

ఓటీటీలో మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అయితే ఎగబడి చూస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమానే. ‘దృశ్యం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. ఇదొక రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్.. కూతురి మరణానికి కారణమైన వారిపై హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది ఈ సినిమాలో మెయిన్ పాయింట్. శామ్యూల్ తన కూతురు ఐరీన్ ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు. అయితే ఒకరోజు అకస్మాత్తుగా ఆ అమ్మాయి కనిపించకుండా. కొన్ని రోజుల తర్వాత ఐరీన్ శవమై కనిపిస్తుంది. కంటికి రెప్పలా కాపాడుకున్న కూతురు ఇలా జరగడంతో శామ్యూల్ పిచ్చివాడైపోతాడు. తన కూతురు చావుకు కారణమైన వారిని పట్టుకోవాలని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతాడు. కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. చివరికి తనే రంగంలోకి దిగుతాడు.

ఈ క్రమంలో తన కూతురు చావు వెనక ఆంటోనీ జేవియర్ అనే ఒక కిలాడీ పోలీస్ ఆఫీసర్ హస్తం ఉందని శామ్యూల్‌కు అనుమానం వస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఆంటోనీకి చాలా తెలివైన అవినీతిపరుడైన పోలీస్ అన్న చెడ్డ పేరుంటుంది. తనకున్న అధికారంతో శామ్యూల్‌కు తన కూతురు ఆచూకీ దొరక్కుండా అడుగడుగునా అడ్డుపడుతుంటాడు జేవియర్.
మొత్తానికి శామ్యూల్, జేవియర్ కు మధ్యన ఓ మైండ్ గేమ్ నడుస్తుంది. మరి చివరికి ఆ పోలీస్ ఆఫీసర్‌ కి శామ్యూల్ ఎలా బుద్ది చెప్తాడు ? అసలు అతని కూతురి చావుకు కారణమెవరు? ఆ మిస్టరీ ఏమిటి ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

దృశ్యం తరహాలోనే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో పరుగులు పెట్టే ఈ సినిమా పేరు ‘వలతు వశతే కల్లన్’ (Valathu Vashathe Kallan). బిజు మీనన్, జోజు జార్జ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకలు ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడీ సినిమా మార్చి 27 నుంచి మనోరమ మాక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు వెర్షన్ పై క్లారిటీ లేదు కానీ.. ఇది ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఒరిజినల్ మలయాళ భాషలో అందుబాటులో ఉండనుంది.\

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us