Samantha: ఏం మాయా వేశావే సినిమాతో ఏ ముహుర్తాన ఇండస్ట్రీలో అడుగుపెట్టిందో కానీ సమంత నిజంగానే తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. వరుస సినిమాలు, అగ్ర కథానాయకుల సరసన నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇక నాగచైతన్యతో వివాహం తర్వాత అక్కినేని వారి కోడలిగా మారిన సామ్.. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో వేగాన్ని ఏ మాత్రం తగ్గించలేదు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతోంది.
ఇక తాజాగా ఫ్యామిలీ మ్యాన్ -2 వెబ్ సిరీస్‌లో నటించిన సమంత డిజిటల్ స్క్రీన్‌పై కూడా తన సత్తాను చాటుకుంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టిన సామ్.. తొలి అడుగులోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా సమంతకు మరో దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్‌ను ఇచ్చినట్లు వార్తులు వస్తున్నాయి. సమంత లీడ్ రోల్‌లో ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేస్తోన్న నెట్‌ఫ్లిక్స్.. ఇందుకోసం ఆమెకు ఏకంగా రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే డిజిటల్ స్క్రీన్‌పై సమంత మరో కొత్త అధ్యయనానికి తెర తీస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Also Read: Jagapathi Babu: బాలీవుడ్ లోకి జగపతి బాబు.. స్టార్ హీరోకు తండ్రిగా నటించననున్న విలక్షణ నటుడు
వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న అక్కినేని యంగ్ హీరో.. మైత్రి మూవీస్ బ్యానర్ లో అఖిల్
Salman Khan: మరో సూపర్ హిట్ సినిమాపైన కన్నేసిన సల్మాన్.. విజయ్ సినిమాను రీమేక్ చేయనున్న భాయ్ జాన్..