AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న అక్కినేని యంగ్ హీరో.. మైత్రి మూవీస్ బ్యానర్ లో అఖిల్

టాలీవుడ్‌లో మైత్రి మూవీస్‌ మేకర్స్‌ దూసుకుపోతున్నారు. ఓ వైపు వరుసగా సినిమాలు తీస్తూనే.. మరో వైపు హీరోలకు కూడా అడ్వాన్స్‌లు ఇస్తూ.. లాక్‌ చేస్తున్నారు.

వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న అక్కినేని యంగ్ హీరో.. మైత్రి మూవీస్ బ్యానర్ లో అఖిల్
Rajeev Rayala
|

Updated on: Jun 13, 2021 | 11:36 PM

Share

akkineni akhil: టాలీవుడ్‌లో మైత్రి మూవీస్‌ మేకర్స్‌ దూసుకుపోతున్నారు. ఓ వైపు వరుసగా సినిమాలు తీస్తూనే.. మరో వైపు హీరోలకు కూడా అడ్వాన్స్‌లు ఇస్తూ.. లాక్‌ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ క్రేజీ హీరోను లాక్‌ చేశారట మైత్రీ వారు.అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున వారసుడిగా టాలీవుడ్‌లోకి దూసుకువచ్చిన మరో హీరో అక్కినేని అఖిల్. సిసింద్రీ సినిమాతో ఊహతెలియని వయసులోనే స్టార్‌ డమ్ను సంపాదించిన ఈ హీరోను.. మైత్రీ మూవీ మేకర్స్‌ లాక్‌ చేశారట. త్వరలో తమ బ్యానర్‌లో ఓ మూవీ చేసేందుకు ఇప్పుడే అడ్వాన్స్‌ బుకింగ్ చేసుకున్నారట. ఇప్పుడిదే విషయం ఫిల్మ్‌నగర్‌లో జోరుగా వినిపిస్తోంది.

అఖిల్ ప్రస్తుతం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమాను విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నారు. బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్‌ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఈ పాటికే రిలీజ్ కావాల్సుంది కాని.. కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా కూల్ అయిపోవడం.. థియేటర్లు ఓపెన్ అవుతుండడంతో ఈ సినిమాను రిలీజ్‌ చేసే పనిలో పడ్డారు అఖిల్. ఆలస్యం చేయకుండా ఆగస్టు ఫస్ట్ వీక్‌లో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇక ఇప్పటికే గోపీసుందర్‌ స్వరపరిచిన ఈ సినిమాలోని సాంగ్స్‌ అందర్నీ ఆకట్టుకుంటూ.. సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.ఈ సినిమాతో పాటు అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో “ఏజెంట్” సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ తన లుక్ ని మార్చుకొని, కొత్త గెటప్ లో కి ట్రాన్స్‌ఫాం అయ్యారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

రూటు మార్చిన హరీష్ శంకర్.. డైరెక్షన్ నుంచి ప్రొడ్యూసర్ గా మారిన గబ్బర్ సింగ్ డైరెక్టర్

మరోసారి కనువిందు చేయనున్న పవర్ స్టార్ సమంత జోడీ.. హరీష్ శంకర్ సినిమాలో పవన్ సరసన కుందనపు బొమ్మ

బాలయ్య కోసం అదిరిపోయే కథను సిద్ధం చేసిన అనిల్ రావిపూడి.. సినిమా పట్టాలెక్కేది ఎప్పుడంటే..

Follow Us
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్