Indian Idol Telugu Episode 2: ఆ వాయిస్‏కు థమన్ ఫిదా.. మణిశర్మకు పరిచయం చేస్తానంటూ హామీ..

|

Feb 27, 2022 | 8:09 PM

ప్రేక్షకులకు ఎప్పుడూ సూపర్ హిట్ మూవీస్.. థ్రిల్లింగ్ వెబ్ సిరీస్.. టాక్ షోస్.. గేమ్ షోస్‏తో 100% వినోదాన్ని అందిస్తుంది ఆహా. ఈసారి ఓటీటీ ప్రేక్షకుల కోసం హిందీలో ఫేమస్ అయిన సింగింగ్ కాంపిటేషన్ షో

Indian Idol Telugu Episode 2: ఆ వాయిస్‏కు థమన్ ఫిదా.. మణిశర్మకు పరిచయం చేస్తానంటూ హామీ..
Telugu Indian Idol
Follow us on

ప్రేక్షకులకు ఎప్పుడూ సూపర్ హిట్ మూవీస్.. థ్రిల్లింగ్ వెబ్ సిరీస్.. టాక్ షోస్.. గేమ్ షోస్‏తో 100% వినోదాన్ని అందిస్తుంది ఆహా. ఈసారి ఓటీటీ ప్రేక్షకుల కోసం హిందీలో ఫేమస్ అయిన సింగింగ్ కాంపిటేషన్ షో ఇండియన్ ఐడల్‏ను (Indian Idol ) తెలుగులోకి తీసుకువచ్చింది ఆహా (Aha). అద్భుతమైన గాత్రంతో ఆకట్టుకునే సింగర్స్‏ను ఆహా వేదికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. ఈ షోకు సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్‏గా వ్యవహరిస్తుండగా.. హీరోయిన్ నిత్యా మీనన్, సింగర్ కార్తీక్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ప్రసారమైన ఫస్ట్ ఎపిసోడ్‏కు విశేషమైన స్పందన వచ్చింది. తాజాగా శనివారం ఈ షో సెకండ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది. ఇందులో సంగీతంతోపాటు.. కామెడీని కూడా పంచారు. ఎపిసోడ్ ఎంట్రీలోనే హోస్ట్ శ్రీరామచంద్రపై పంచ్ డైలాగ్స్ వేసి నవ్వించాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్.

ఈ సెకండ్ ఎపిసోడ్ నెల్లూరుకు చెందిన ఇద్దరూ అక్కాచెల్లెళ్లతో మొదలైంది. అందులో వైష్ణవి అనే అమ్మాయి.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమా నుంచి ఆవ్ తుజొ మోకార్తా సాంగ్ పాడి ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన ఆమె చెల్లి వాగ్దేవి మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలోని లాహే లాహే పాటతో ఆకట్టుకుంది. ఈ ఇద్దరూ అక్కాచెల్లెళ్ల వాయిస్‏లకు జడ్జీలు ఫిదా అయ్యారు. వీరిద్ధరిలో వాగ్దేవి వాయిస్ కల్చర్ నచ్చడంతో ఆమెను మణిశర్మకు రికమండ్ చేస్తానని థమన్ మాటిచ్చాడు..

ఇక వీరిద్దరి తర్వాత వచ్చిన లాలస.. అమెరికా నుంచి ఇండియాకు కేవలం పాటలు పాడడం కోసం వచ్చింది. ఆమె స్వాతి కిరణం సినిమాలోని ఆనతి నీయరా.. పాటతో అందరినీ మెస్మరైజ్ చేసింది. లాలస సింగర్ శ్రీరామచంద్రకు కజిన్ కావడం విశేషం. ఆమె గాత్రానికి ఫిదా అయిన జడ్జస్.. గ్రాండ్ ఫినాలే అనుభూతి తమకు కలిగిందని చెప్పరు. ఇందులో లాలస గోల్డెన్ మైక్ సొంతం చేసుకుంది.

ఇక ఆ తర్వాత వచ్చిన మనీష్.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటను పాడాడు.. పాట పాడడమే కాకుండా.. నాటు నాటు అంటూ స్టెప్పులు కూడా వేశాడు. మనీష్ ఆసక్తిని గమనించిన జడ్జస్ అతనితో సెల్ఫీ దిగారు. మనీష్ తదుపరి రౌండ్ కు ప్రమోట్ కాలేదు.

తర్వాత.. మారుతీ… పాటలు పాడడం అంటే ఎంతో ఇష్టం.. సంగీతంలో రాణించాలనే తపనతో.. అందుకోసం పార్ట్ టైమ్ జాబ్స్ కూడా చేసానని చెప్పుకొచ్చాడు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చినట్టు చెప్పాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో జాగో పాట పాడి అలరించి.. గోల్డెన్ టికెట్ అందుకున్నాడు.

ఇక ఆరవ కంటెస్టెంట్‏గా జయంత్ మాధుర్ ఎంట్రీ ఇచ్చాడు. అతను ఆంధ్రావాలా సినిమా నుంచి నైరే నైరే.. పాటను ఆలపించాడు. అయితే అతని పాటతో సంతృప్తి చెందని థమన్.. మరో పాట పాడమని అడిగాడు. దీంతో అతను ఉండిపోరాదే.. పాట పాడి ఆకట్టుకున్నాడు. దీంతో అతడికి గోల్డెన్ టికెట్ ఇచ్చారు. ఈ ఎపిసోడ్‏లో ఒకరు గోల్డెన్ మైక్.. మరోకరు గోల్డెన్ టికెట్ అందుకున్నారు.

Also Read: Prudhvi Raj: భీమ్లా నాయక్ సినిమాపై పృథ్వీ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ విషయంలో బాధగా ఉందంటూ..

Shruti Haasan: కరోనా బారిన పడ్డ హీరోయిన్.. ఆందోళనలో సలార్ చిత్రయూనిట్..

Prakash Raj: చిత్రపరిశ్రమను క్షోభపెడుతూ ప్రోత్సాహిస్తున్నామంటే నమ్మాలా ?.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్..

Chiranjeevi : గ్యాంగ్‌లీడర్‌ మార్క్ మసాలా ఎంటర్‌టైనర్‌‌తో రానున్న మెగాస్టార్..?