AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fighter OTT: ఆ ఓటీటీలోకి వచ్చేసిన హృతిక్ రోషన్ ‘ఫైటర్’.. ఫ్యాన్స్ డిజప్పాయింట్‌.. ఎందుకంటే?

హృతిక్ రోషన్ , దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ బాలీవుడ్ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని హృతిక్ రోషన్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ‘ఫైటర్’ సినిమా ఓటీటీ విడుదల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు . థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్..

Fighter OTT: ఆ ఓటీటీలోకి వచ్చేసిన హృతిక్ రోషన్ 'ఫైటర్'.. ఫ్యాన్స్ డిజప్పాయింట్‌.. ఎందుకంటే?
Fighter Movie
Basha Shek
|

Updated on: Mar 21, 2024 | 4:32 PM

Share

రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న విడుదలైన ‘ఫైటర్’ సినిమాను ఓటీటీలో చూడాలని ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడు శుభవార్త అందింది. హృతిక్ రోషన్ , దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ బాలీవుడ్ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని హృతిక్ రోషన్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ‘ఫైటర్’ సినిమా ఓటీటీ విడుదల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు . థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫైటర్’. ఫైటర్‌ ప్లేన్స్‌ యాక్షన్‌ సీన్స్‌ ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచాయి. దీపికా పదుకొణె, అనిల్ కపూర్, హృతిక్ రోషన్ ఫైటర్ పైలట్‌లుగా కనిపించారు. థ్రిల్‌గా సాగే యాక్షన్‌ సన్నివేశాలను ప్రేక్షకులు మెచ్చుకున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో సంచలన విజయం సాధించి ఇప్పుడు OTT లోకి అడుగుపెట్టింది.

ఫైటర్’ సినిమా శుక్రవారం (మార్చి 21) అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. అయితే ప్రస్తుతం కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. అందుకే తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేయాలంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో దీపికా పదుకొణె కొన్ని సన్నివేశాల్లో బోల్డ్‌గా నటించింది. దీనిపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా ఫైటర్ సినిమా భారతీయ బాక్సాఫీస్ వద్ద 199.45 కోట్ల రూపాయలను వసూలు చేసింది. OTTలో కూడా రికార్డ్ వ్యూయర్‌షిప్‌ను అందుకునే అవకాశముంది. యుద్ధం’, ‘పఠాన్‌’ సినిమాలతో అటెన్షన్‌ని సొంతం చేసుకున్న దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ ‘ఫైటర్‌’ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అక్షయ్ ఒబెరాయ్, కరణ్ సింగ్ గ్రోవర్, సంజీదా షేక్ తదితరులు కూడా ఈ సినిమాలో నటించారు. మరి థియేటర్లలో ఫైటర్ సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

హృతిక్ రోషన్ ట్వీట్..

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!