
ప్రస్తుతం హారర్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఓటీటీలో ఈ జోనర్ చిత్రాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు ప్రతి వారం వివిధ భాషలకు చెందిన హారర్ సినిమాలు, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఆయా భాషల్లోకి అనువాదం చేసి మరీ రిలీజ్ చేస్తుంటాయి. అలా బుధవారం (అక్టోబర్ 21) కూడా ఒక హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. గతంలో నేషనల్ అవార్డు గెల్చుకున్న ఓ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ఇది. కొన్ని రోజల క్రితమే థియేటర్లలో విడుదలైంది. ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించడమే కాదు బాగా భయ పెట్టింది కూడా. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు ఉన్నట్లుండి బిల్డింగ్ టవర్స్ పైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటారు. మరికొంత మంది విద్యార్థులు కూడా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఇదే క్రమంలో మంచానికే పరిమతమైన తన కూతురితో కలిసి నగరానికి దూరంగా ఉంటున్న అధర్వకు ఈ విషయం తెలిసి షాకవుతాడు. తన కూతురికి ఈ గతి పట్టించిన వశీకరణ మాదిరే స్కూల్ లో జరుగుతుందని భావించి అక్కడకు వెళతాడు.
రాజ్‌నాధ్ అనే వ్యక్తి ఆ స్కూల్ విద్యార్థినులను హిప్నటైజ్ చేసి నగరంలోకి పంపించినట్లు అధర్వకు తెలుస్తుంది. ఈ విద్యార్థులు రాక్షసుల్లా ప్రవర్తిస్తూ నగరంలో కనిపించిన వారందరినీ దారుణంగా చంపేస్తారు. మరి ఈ దారుణాలకు అధర్వ ఎలా అడ్డుకున్నాడు? రాజ్ నాథ్ ఎందుకిలా చేశాడు? అతనిని అధర్వ పట్టుకున్నాడా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
Iss school mein faila Vash ka saaya hai, aur isse koi nahi bach paaya hai 🔥
Watch Vash Level 2, out now, on Netflix.#VashLevel2OnNetflix pic.twitter.com/8lfqxZ3Aq9— Netflix India (@NetflixIndia) October 22, 2025
ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీ పేరు వష్ లెవల్ 2. గుజరాతితో పాటు హిందీ భాషలోనూ ఈ హారర్ థ్రిల్లర్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. తెలుగులో హీరోయిన్ గా నటించి, ఆపై బిగ్ బాస్ లోనూ మెప్పించిన గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించడం విశేషం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..