AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: థియేటర్లలో 2000 కోట్ల వసూళ్లు.. ఇప్పుడు ఓటీటీలో హారర్ థ్రిల్లర్.. ఐఎండీబీ టాప్ రేటింగ్ మూవీ

ఇప్పుడు ఎక్కడైనా సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలదే హవా. ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలకే ఆడియెన్స్ ఎక్కువ ఓటు వేస్తున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా విషయానికి వస్తే.. బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పటికీ..

OTT Movie: థియేటర్లలో 2000 కోట్ల వసూళ్లు.. ఇప్పుడు ఓటీటీలో హారర్ థ్రిల్లర్.. ఐఎండీబీ టాప్ రేటింగ్ మూవీ
OTT Movie
Ravi Kiran
|

Updated on: Sep 28, 2025 | 7:00 AM

Share

ఇప్పుడు థియేటర్లలో రిలీజైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి సినిమాలు. చిన్న సినిమాలకు అయితే ఈ గ్యాప్ కూడా ఉండడం లేదు.ఇక ఓ మోస్తరు విజయం సాధించిన సినిమాలు 45 రోజులకు అలాగే బ్లాక్ బస్టర్ సినిమాలయితే 2 నెలలు.. మొత్తానికి ఎలాంటి సినిమా అయినా 30, 45 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే ఈ సినిమా విషయంలో కాస్త డిఫరెంట్. ఆగస్టు 08న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ను అందించింది. బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధించింది. ట్రేడ్ నిపుణుల ప్రకారం ఈ సినిమా రూ. 2000 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాను సుమారు రూ.335 కోట్లతో తెరకెక్కించారు. అయితే ఇప్పటికే ఈ మూవీ 23.5 కోట్ల డాలర్లు అంటే సుమారు రూ.2 వేల కోట్లు వసూలు చేసింది. అసలు ఈ మూవీ స్టోరీనే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒకే క్లాస్ కు చెందిన ఒక్క స్టూడెంట్ తప్ప మిగిలిన వాళ్లందరూ ఒకే రాత్రి ఒకే సమయానికి మామయైపోతారు. ఇది అక్కడి వాళ్లకు అంతుబట్టదు. అసలు విద్యార్థులు ఏమయ్యారు? ఎక్కడికి వెళ్లారన్నది తెలుసుకోవడమే ఈ సినిమా కథ. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి ఐఎండీబీలో ఏకంగా 7.8 రేటింగ్ ఉంది. కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ చాలా చోట్ల థియేటర్లలో ఆడుతున్నా ఓటీటీలోకి తీసుకొచ్చారు మేకర్స్.

అయితే ప్రస్తుతానికి ఇది వీడియో ఆన్ డిమాండ్ గా అందుబాటులో ఉంది. అంటే సినిమా చూడాలంటే రెంట్ చెల్లించాల్సిందే. ఈ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు వెపన్స్. జాక్ క్రెగర్ తెరకెక్కించి నీ హారర్ థ్రిల్లర్ మూవీలో జోష్ బ్రోలిన్, జూలియా గార్నర్, ఆస్టిన్ అబ్రామ్స్, కేరీ క్రిస్టోఫర్, టోబీ హస్ లాంటి టాప్ స్టార్స్ నటించారు. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోన్న వెపన్స్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సెప్టెంబర్ 9 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా ఒకేసారి నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి అడుగుపెట్టంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు ఆపిల్ టీవీ ప్లస్, వుడు, గూగుల్ ప్లేలలోకి ఈ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది.

Follow Us
మందారంతో అద్భుతం.. ఇలా చేస్తే మీ జుట్టు మిల మిలా మెరవాల్సిందే
మందారంతో అద్భుతం.. ఇలా చేస్తే మీ జుట్టు మిల మిలా మెరవాల్సిందే
కుక్క, పిల్లులకు రాత్రి పూట నిజంగా దెయ్యాలు కనిపిస్తాయా?
కుక్క, పిల్లులకు రాత్రి పూట నిజంగా దెయ్యాలు కనిపిస్తాయా?
రాగి వర్సెస్ జొన్న.. ఆరోగ్యానికి,పోషకాల పరంగా ఏ పిండి ఉత్తమమైనది?
రాగి వర్సెస్ జొన్న.. ఆరోగ్యానికి,పోషకాల పరంగా ఏ పిండి ఉత్తమమైనది?
IPL 2027: గేమ్ ప్లాన్ షురూ చేసిన సీఎక్కే.. రంగంలోకి మరో మాజీ ప్లేయర్..!
IPL 2027: గేమ్ ప్లాన్ షురూ చేసిన సీఎక్కే.. రంగంలోకి మరో మాజీ ప్లేయర్..!
సూపర్‌స్టార్‌కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఆ హీరోకు ఉన్నాయి..
సూపర్‌స్టార్‌కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఆ హీరోకు ఉన్నాయి..
3వ టీ20లో టీమిండియాకు షాక్.. మైదానం వీడిన తిలక్ వర్మ..!
3వ టీ20లో టీమిండియాకు షాక్.. మైదానం వీడిన తిలక్ వర్మ..!
రేపే తీరం దాటనున్న అర్నబ్.. ఏపీలో వాతావరణం ఎలా ఉంటుందంటే..?
రేపే తీరం దాటనున్న అర్నబ్.. ఏపీలో వాతావరణం ఎలా ఉంటుందంటే..?
తొలి రౌండ్‌ వేలంలో ఐదుగురు.. నలుగురు మనోళ్లే..!
తొలి రౌండ్‌ వేలంలో ఐదుగురు.. నలుగురు మనోళ్లే..!
రీల్స్‌ వేరు.. రియల్‌ రాజకీయం వేరు.. లక్షల్లో ఫాలోవర్స్‌ ఉన్నా..
రీల్స్‌ వేరు.. రియల్‌ రాజకీయం వేరు.. లక్షల్లో ఫాలోవర్స్‌ ఉన్నా..
కూరగాయల ధరలు ఢమాల్.. సామాన్యులకు ఊరట..
కూరగాయల ధరలు ఢమాల్.. సామాన్యులకు ఊరట..