
థియేటర్లు అయినా, ఓటీటీలయినా ప్రజెంట్ హారర్ థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషతో సంబంధం లేకుండా మరీ ఈ సినిమాలను చూసేస్తున్నారు ఆడియెన్స్. ముఖ్యంగా ఓటీటీలో ఈ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ప్రతివారం పలు ఓటీటీ సంస్థలు ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను అనువాదం చేసి మరీ ఆయా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అలా ఇప్పుడు ఓ బిగ్గెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈ ఏడాది ఆగస్టులో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. సుమారు రూ. 335 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా రూ. 2400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు 7.5 రేటింగ్ దక్కడం విశేషం. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్, వుడు గూగుల్ వీడియోప్లే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాకపోతే రెంటల్ బేసిస్ లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో చాలా మంది ఈ సినిమాను చూడలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు కొత్తగా మరో ఓటీటీలోకి ఈ బ్లాక్ బస్టర్ సినిమా రానుంది. అది కూడా ఉచితంగా చూసే అవకాశం. తెలుగులోనూ ఈ బ్లాక్ బస్టర్ మూవీ అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మేబ్రూక్ అనే ఊరి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. సరిగ్గా రాత్రి 2:17 గంటలకు.. ఇళ్లలో ఉన్న 17 మంది చిన్న పిల్లలు ఒకేసారి అదృశ్యమైపోతారు. వాళ్లు తిరిగి ఇంటికి రారు. ఒక స్కూల్ క్లాస్ రూమ్‌లో మిగిలిన పిల్లలందరూ మాయమైపోతే.. ఒక్క పిల్లాడు మాత్రమే మిగులుతాడు. దీంతో అందరి అనుమానం ఆ క్లాస్ టీచర్ జస్టిన్ మీద పడుతుంది. ఇంతకీ ఆ 17 మంది పిల్లలు ఏమయ్యారు? ఆ టీచర్ పాత్ర ఏంటి? ఆ ఒక్క పిల్లాడు ఎలా మిగిలాడు? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు వెపన్స్. జనవరి 08 నుంచి ఈ మూవీ జియో హాట్ స్టార్ లో ఫ్రీగా స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
At 2:17 a.m., seventeen children disappeared from their homes and never came back.
Where did they go?#Weapons, streaming January 8 onwards on JioHotstar. pic.twitter.com/46m9ewEc06
— JioHotstar (@JioHotstar) December 23, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి