OTT Movie: జనాలను కిరాతంగా చంపేస్తోన్న గుమ్మడికాయ.. నవ్విస్తూనే వణుకుపుట్టించే హారర్ కామెడీ.. ఏ ఓటీటీలో అంటే..

|

Oct 22, 2024 | 10:54 AM

ఇటీవల ఓటీటీల్లో హారర్, మిస్టరీ, థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హారర్ కామెడీ మూవీ ఇప్పుడు ప్రేక్షకులకు నవ్విస్తూనే వణుకుపుట్టి్స్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ? అదే కార్వ్డ్

OTT Movie: జనాలను కిరాతంగా చంపేస్తోన్న గుమ్మడికాయ.. నవ్విస్తూనే వణుకుపుట్టించే హారర్ కామెడీ.. ఏ ఓటీటీలో అంటే..
Carved Movie
Follow us on

ఇప్పుడు ఓటీటీల్లో హారర్ కామెడీ జానర్ చిత్రాలు ఎక్కువగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి కంటెంట్ చూసే మూవీ లవర్స్ కోసం ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు తీసుకువస్తున్నారు మేకర్స్. తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలను కూడా మరోసారి రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హాలీవుడ్ హారర్ కామెడీ మూవీ కార్వ్డ్ చిత్రాన్ని ఓటీటీ అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. 2018లో ఓ షార్ట్ ఫిల్మ్ గా వచ్చిన ఆ చిత్రాన్ని ఇప్పుడు పూర్తిస్థాయి ఫీచర్ ఫిల్మ్ గా రిలీజ్ చేశారు. జస్టిన్ హార్డింగ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా సోమవారం నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నిజానికి ఇదే పేరుతో 2018లో ఓ షార్ట్ ఫిల్మ్ వచ్చింది.

ఇప్పుడు అదే సినిమాను పూర్తిస్థాయిలో రిలీజ్ చేశారు. ఓ గుమ్మడికాయ పగబట్టడం .. మనుషులను చంపడం అనే డిఫరెంట్ కాన్పెప్ట్ తో వచ్చిన సినిమా ఇది. విదేశాల్లో హాలోవిన్ పండగను ఘనంగా జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది అక్టోబర్ 31న జరుపుకునే ఈోరజున చాలా మంది వెరైటీ కాస్ట్యూమ్స్ ధరించి కనిపిస్తారు. ఇపుప్డు ఆ డే థీమ్ తో కార్వ్డ్ చిత్రాన్ని రూపొందించారు.

కథ విషయానికి వస్తే..
కార్వ్డ్ సినిమా హాలోవిన్ రోజు ఓ ఊళ్లో చిక్కుకుపోయిన కొందరు వ్యక్తులను చంపడానికి గుమ్మడికాయ ప్రయత్నిస్తుంది. ఆ వ్యక్తులు హాలోవిన్ రోజు అదే గుమ్మడికాయను కట్ చేయడానికి ట్రై చేస్తుండగా.. ఆకస్మాత్తుగా అది వాళ్లను చంపడం స్టార్ట్ చేస్తుంది. తన తీగలతో వాళ్లను చుట్టేసి ఊపిరాడకుండా చేయడం.. వాళ్ల గొంతులు కట్ చేసి చంపేస్తుంది. నవ్విస్తూనే వణుకుపుట్టించే ఈ హారర్ కామెడీ ఇప్పుడు హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇది చదవండి : Tollywood: వణుకుపుట్టించే థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అస్సలు మిస్సవద్దు..

Tollywood: ఈ అరాచకం ఏందీ సామి.. ఎన్టీఆర్‏తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ.. ? ఇప్పుడు చూస్తే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.