
హారర్ సినిమాలకు క్రేజ్ ఎప్పుడూ తగ్గదు. ఇలాంటి సినిమాలను చూడటానికి ఆడియన్స్ ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటారు. ఇప్పటికే హారర్ జోనర్ లో ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి. రీసెంట్ గా కొరియన్ కనకరాజు అనే సినిమా కూడా థియేటర్స్ లో ప్రేక్షకులను భయపెడుతూ నవ్వించింది. అలాగే ఓటీటీల్లోనూ సినిమాలు దూసుకుపోతున్నాయి. వాటిలో హారర్ సినిమాలు, సిరీస్ లు ముందు వరసలో ఉంటున్నాయి. చూసేందుకు ఇప్పుడు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఓటీటీలో ఈ జానర్ చిత్రాలకు ఎక్కువగా ఆదరణ లభిస్తుంది. అందుకే మేకర్స్ ఈ జానర్ సినిమాలు, వెబ్ సిరీస్ తెరకెక్కించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు జనాలు ఎక్కువగా భయానక కథలు, దెయ్యాలు, ఉత్కంఠభరితమైన కంటెంట్‌ను ఇష్టపడుతున్నారు.
అలాంటి వారికోసమే ఇప్పుడు ఈ భయానక సిరీస్ గురించి తెలుసుకుందాం. ఈ వెబ్ సిరీస్ పేరు రస్కిన్ బాండ్ రాసిన పార్చయీ: ఘోస్ట్ స్టోరీస్. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ జీ5లో ప్రసారమయ్యే ఒక హారర్-థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీనిని ప్రముఖ రచయిత రస్కిన్ బాండ్ రాసిన దెయ్యాల కథల ఆధారంగా రూపొందించబడింది. ఈ సిరీస్‌లో 12 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి. దీనికి IMDbలో 5.8 రేటింగ్ ఉంది.
అలాగే అంధర్ మాయ అనేది జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న మరాఠీ హర్రర్ వెబ్-సిరీస్. ప్రతి సంవత్సరం కొంకణ్‌లోని పాత భవనంలో సమావేశమయ్యే ఖాటు కుటుంబం గురించి ఉంటుంది. అందులో బహిర్గతం కాని రహస్యాలు, వారసత్వంగా వచ్చిన శాపాలు, ప్రాణాంతక సంఘటనలు ఉన్నాయి. దీనికి IMDbలో 6.5 రేటింగ్ ఉంది. ఇవే కాకుండా.. IMDbలో 7 రేటింగ్ ఉన్న మూఢనమ్మకాల సిరీస్ ‘దాయన్’. నటి టిన్హా దత్తా , మోహిత్ మల్హోత్రా రూపొందించిన ఈ సిరీస్, చేతబడి, మంత్రగత్తెలు, కుటుంబాల మధ్య చీకటి సంబంధాలను తెలియజేస్తుంది. జీ5లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్, కథాంశంతో థ్రిల్, భయాన్ని కలిగిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి