మహానటి, సీతారామం సినిమా తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన మరో సినిమా లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. అంతేకాదు లక్కీ భాస్కర్ సినిమాతో మొదటి సారి 100 కోట్ల క్లబ్ లో చేరాడు దుల్కర్ సల్మాన్. అమరన్, క, బఘీరా లాంటి సినిమాలు పోటీలో ఉన్నా లక్కీ భాస్కర్ కు భారీ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో దుల్కర్ సల్మాన్ సినిమా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో లక్కీ భాస్కర్ సినిమా ఓటీటీ రిలీజ్ కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం 30 కోట్లకు పైగానే డీల్ జరిగినట్లు తెలుస్తోంది. డీల్ ప్రకారం నెల రోజుల తర్వాత నే లక్కీ భాస్కర్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అంటే నవంబర్ 30న లేదా ఆతర్వాతి తేదీల్లో దుల్కర్ సల్మాన్ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుందన్నమాట. త్వరలోనే లక్కీ భాస్కర్ ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.
నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై లక్కీ భాస్కర్ సినిమాను తెరకెక్కించారు. రాంకీ, సూర్య శ్రీనివాస్, మానస చౌదరి, సచిన్ ఖేడ్‌కర్, టినూ ఆనంద్, కసిరెడ్డి, హైపర్ ఆది తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించాడు.
#LuckyBaskhar Enters into 100CRS Club at Boxoffice 🔥 🌊 #DulquerSalmaan | #MeenakshiChaudhary | #GVPrakash | #VenkyAtluri#BlockbusterLuckyBaskhar
pic.twitter.com/EuRNLBtmRs— OTT STREAM UPDATES (@newottupdates) November 14, 2024
Diwali turned out to be a Career peak phase for both #Sivakarthikeyan & #DulquerSalman 📈🔥
– SK to join First 300Cr club through #Amaran
– DQ Joined First 100Cr club through #LuckyBaskhar pic.twitter.com/1vxDpB7vxf— Heyopinions (@heyopinionx) November 14, 2024
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.