Disney+ Hotstar: ఇకపై ఇంట్లోనే థియేటర్‌ ఫీల్‌.. ఓటీటీ యూజర్లకు అదిరిపోయే సౌండ్‌ ఎక్స్‌పీరియన్స్…

|

Sep 16, 2022 | 9:53 PM

Disney+ Hotstar: ఒకప్పుడు సినిమాలు నేరుగా ఫోన్‌లోనే విడుదలవుతాయంటే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ప్రస్తుతం ఓటీటీ మార్కెట్‌ థియేటర్‌ మార్కెట్‌ను డామినేట్ చేసే రోజులు వచ్చేశాయి. పెద్ద, పెద్ద సంస్థలు ఓటీటీ మార్కెట్లోకి అడుగు పెట్టడం, బడా నటీనటులు...

Disney+ Hotstar: ఇకపై ఇంట్లోనే థియేటర్‌ ఫీల్‌.. ఓటీటీ యూజర్లకు అదిరిపోయే సౌండ్‌ ఎక్స్‌పీరియన్స్...
Disney+ Hotstar
Follow us on

Disney+ Hotstar: ఒకప్పుడు సినిమాలు నేరుగా ఫోన్‌లోనే విడుదలవుతాయంటే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ప్రస్తుతం ఓటీటీ మార్కెట్‌ థియేటర్‌ మార్కెట్‌ను డామినేట్ చేసే రోజులు వచ్చేశాయి. పెద్ద, పెద్ద సంస్థలు ఓటీటీ మార్కెట్లోకి అడుగు పెట్టడం, బడా నటీనటులు సైతం వెబ్‌ సిరీస్‌లో నటించడానికి ఆసక్తి చూపిస్తుండడంతో ప్రేక్షకులు సైతం ఓటీటీపై ఆదరణ చూపిస్తున్నారు. ఇక కరోనా తర్వాత ఇంట్లోనే సినిమా చూసే వారి సంఖ్య పెరుగుతోంది. లార్జ్‌ స్క్రీన్స్‌తో కూడిన స్మార్ట్‌ టీవీలు అందుబాటులోకి రావడంతో ఇంట్లోనే థియేటర్‌ సెటప్‌ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది.

అయితే ఎంత పెద్ద స్క్రీన్‌ అయినా సౌండ్‌ క్వాలిటీ లేకపోతే థియేటర్‌ ఫీల్‌ ఫుల్‌ ఫిల్‌ కాదని చెప్పడంలో సందేహం లేదు. ఇందుకోసమే ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌ స్టార్ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఓటీటీ వేదికగా విడుదలయ్యే కంటెంట్‌కు డాల్బీ అట్మాస్‌ సౌండ్‌ క్వాలిటీతో అందించనున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ డివైజ్‌లతోపాటు టీవీ, ఏవీఆర్‌, సౌండ్‌బార్‌లకు ఈ కొత్త ఫీచర్‌ సపోర్ట్‌ చేయనుంది.

ఈ సరికొత్త ఫీచర్‌తో ప్రేక్షకులు అచ్చంగా థియేటర్‌లో సినిమా చూసిన అనుభవాన్ని పొందతుతారు. డిస్నీ+ హాట్‌స్టార్‌లో డాల్బీ అట్మాస్‌తో వచ్చే కంటెంట్‌ను గుర్తించేందుకు వీలుగా డాల్బీ బ్యాడ్జ్‌ అనే ట్యాగ్ అందిస్తారు. దీంతో యూజర్లు డాల్బీ ఫీచర్‌కు సపోర్ట్‌ చేసే కంటెంట్‌ను సులభంగా గుర్తించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..