ప్రజాదరణ పొందుతున్న తొలి మోషన్ క్యాప్చర్ సినిమా ‘ధీర’.. వరంగల్ యువతను అభినందించిన మంత్రి కేటీఆర్..

First motion capture movie 'Dheera': తెలంగాణ యువత అందివచ్చిన అవకాశాలను ఆసరాగా చేసుకొని స్టార్టప్స్ నెలకొల్పి తెలంగాణ కీర్తిని నలు దిశలా

  • uppula Raju
  • Publish Date - 8:13 am, Thu, 31 December 20
ప్రజాదరణ పొందుతున్న తొలి మోషన్ క్యాప్చర్ సినిమా 'ధీర'.. వరంగల్ యువతను అభినందించిన మంత్రి కేటీఆర్..

First motion capture movie ‘Dheera’: తెలంగాణ యువత అందివచ్చిన అవకాశాలను ఆసరాగా చేసుకొని స్టార్టప్స్ నెలకొల్పి తెలంగాణ కీర్తిని నలు దిశలా చాటుతున్నారు. తాజాగా వరంగల్‌కు చెందిన అరుణ్ కుమార్ రాపోలు ఇంజినీరింగ్ పూర్తి అయ్యాక కొన్నాళ్లు యానిమేషన్, గేమింగ్ కంపెనీల్లో పని చేశాడు. ఆ తర్వాత తానే ఏ- థీరం అనే యానిమేషన్ అంకుర పరిశ్రమ స్థాపించాడు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి మనదేశంలో తొలి మోషన్ క్యాప్చర్ సినిమా “ధీర” రూపొందించాడు. పూర్తిగా తెలంగాణలో తయారైన ఈ సినిమా 12 భాషల్లో అమెజాన్ ప్రైం లో ఈ నెల విడుదలై విశేష ప్రజాదరణ పొందుతోంది.

అయితే మంత్రి కేటీఆర్‌ను కలిసిన అరుణ్ కుమార్ తెలంగాణ ఏర్పడ్డాక స్టార్టప్ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుకు కృతజ్ఞతలు తెలిపారు. టీ-హబ్, వీహబ్, టీ-వర్క్స్, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేసి దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా స్టార్టప్ ఎకో సిస్టం అభివృద్ధి చేశారని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తొలి ప్రయత్నంలోనే ఒక అద్భుతమైన మోషన్ క్యాప్చర్ సినిమా తీసి సక్సెస్ సాధించారని కొనియాడారు. తెలంగాణ యువత నూతన ఆలోచనలతో అంకుర పరిశ్రమలు (స్టార్టప్స్) స్థాపించి విజయాలు సాధించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.