OTT Movie: దృశ్యం సినిమాకు మించి ట్విస్టులు.. IMDBలో 10కి 8.2 రేటింగ్.. ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో దృశ్యం టాప్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇందులోని ట్విస్టులు ఓ రేంజ్ లో ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలోనూ దృశ్యం సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ట్విస్టుల ఉంటాయి. ఐఎమ్ డీబీలో ఈ మూవీకి ఏకంగా 8.2 రేటింగ్ ఉండడం విశేషం.

OTT Movie: దృశ్యం సినిమాకు మించి ట్విస్టులు.. IMDBలో 10కి 8.2 రేటింగ్.. ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
OTT Movies

Updated on: Mar 18, 2026 | 9:55 PM

మీకు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టమా? ఓటీటీలో మంచి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే ఒక కిర్రాక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం పదేళ్ల క్రితం అంటే 2016లో విడుదలైంది. కానీ ఇప్పటికీ టాప్ క్రైమ్ థ్రిల్లర్‌ సినిమాలో జాబితాలో ఈ మూవీ పేరు కచ్చితంగా ఉంటుంది. ఈ చిత్రం పేరు ‘ధ్రువంగళ్ పతినారు’ (డి-16). కార్తీక్ నరేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెరకెక్కించే నాటికి కార్తీక్ వయస్సు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆకట్టుకునే కథ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తో ఆడియెన్స్ కు మంచి థ్రిల్లర్ మూవీ అందించాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక ప్రమాదం కారణంగా కాలేజీ రోజుల నాటి ఒక హత్య కేసును దర్యాప్తు చేస్తూ కాలు కోల్పోయిన రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్, తన కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన కేసును ఎలా ఛేదించాడనేది ఈ సినిమా కథ.. ఈ సినిమా కథ మొత్తం రిటైర్డ్ పోలీస్ అధికారి దీపక్ (రహమాన్) చుట్టూ తిరుగుతుంది. ఒక ప్రమాదంలో దీపక్ తన కాళ్లను కోల్పోతాడు. తన కెరీర్‌లోని చివరి, అసంపూర్తిగా ఉన్న ఓ కేసు గురించి విచారిస్తుంటాడు. ఇందులో ఒకే రాత్రి మూడు వేర్వేరు సంఘటనలు (ప్రమాదం, ఆత్మహత్య , హత్య) జరుగుతాయి. ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు ఊహించలేని షాక్ ఇస్తుంది. ఇందులో పోలీసుల దర్యాప్తును చాలా నిశితంగా చూపించారు. ఈ చిత్రాన్ని హిందీలో కూడా నిర్మించనున్నారని ప్రచారం జరుగుతోంది. హిందీలో కథానాయకుడిగా నటుడు వరుణ్ ధావన్ నటిస్తున్నట్లు తెలిసింది. గతంలో దీనిని కన్నడలో కూడా రీమేక్ చేశారు. దాని పేరు ‘దృశ్య’.

ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే. ఈ సినిమా నిడివి కేవలం గంటా 45 నిమిషాలు మాత్రమే. IMDBలో ఈ మూవీకి 10కి 8.2 రేటింగ్ లభించింది. అలాగే ఈ చిత్రం అనేక అవార్డులను కూడా గెలుచుకుంది. వెంకటేష్, మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’ వంటి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు మీకు నచ్చితే , ఈ సినిమా కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓరిజినల్ వెర్షన్ జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. అలాగే తెలుగు వెర్షన్ మాత్రం ఆహా ఓటీటీతో పాటు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us