మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi )కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆచార్య(Acharya). ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలకపాత్రలో నటించారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశిచిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమా లో చిరు చరణ్ ఇద్దరు నక్సలైట్స్ గా కనిపించారు. తండ్రి కొడుకులను కలిపి స్క్రీన్ మీద చూసిన అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ కథలో బలం లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కొరటాల తన కెరీర్ లో ఆచార్య రూపంలో మొదటి ప్లాప్ ను అనుకున్నారు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఆచార్య సినిమా స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ ఆచార్య సినిమాను భారీ ధరకు దక్కించుకుంది.
అమెజాన్ ప్రైమ్ లో ఆచార్య సినిమా ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్నీ అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఓటీటీలో ఈ సినిమా మంచి ఆదరణ అందుకుంటుందని అంటున్నారు విశ్లేషకులు. ఆచార్య సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది. చిరంజీవి – చరణ్ లపైనే పూర్తి దృష్టి పెట్టడంతో మిగిలిన వారి పాత్రలను సరిగ్గా వాడుకోలేకపోయారు కొరటాల. దాంతో ఆచార్య సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరోవైపు చరణ్.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని ఇక్కడ చదవండి :