ఆ తెలుగు మూవీని తొలగించండి, అమెజాన్ ప్రైమ్ వీడియోకు బాంబేహైకోర్టు ఆదేశాలు

తెలుగు మూవీ 'వీ' ని 24 గంటల్లోగా తొలగించాలని అమెజాన్ ప్రైమ్ వీడియోను బాంబేహైకోర్టు  ఆదేశించింది.  హీరో నాని నటించిన ఈ చిత్రం ఈ ప్లాట్ ఫామ్ పై నేరుగా రిలీజయింది....

  • Umakanth Rao
  • Publish Date - 6:38 pm, Wed, 3 March 21
ఆ తెలుగు మూవీని తొలగించండి, అమెజాన్ ప్రైమ్ వీడియోకు బాంబేహైకోర్టు ఆదేశాలు

తెలుగు మూవీ ‘వీ’ ని 24 గంటల్లోగా తొలగించాలని అమెజాన్ ప్రైమ్ వీడియోను బాంబేహైకోర్టు  ఆదేశించింది.  హీరో నాని నటించిన ఈ చిత్రం ఈ ప్లాట్ ఫామ్ పై నేరుగా రిలీజయింది. ఈ సినిమాలో నటి సాక్షి మాలిక్ ఫోటోను చట్ట విరుద్ధంగా (అక్రమంగా) వినియోగించుకున్నారని కోర్టు పేర్కొంది.  ఈ ఫోటో వాడకం  తన క్లయింటు ప్రైవసీకి భంగకరమని సాక్షి మాలిక్ తరఫు లాయర్ పేర్కొన్నారు. 2017 ఆగస్టు నాటి తన ఫోటోను ముంబైకి చెందిన ఓ ఫోటోగ్రాఫర్ క్లిక్ చేశాడని, దాన్ని ఈ మూవీలో మేకర్స్ తనకు తెలియజేయకుండా వాడుకున్నారని సాక్షి మాలిక్ తన పిటిషన్ లోతెలిపింది. గతఏడాది సెప్టెంబరులో ఈ చిత్రం ఈ ప్లాట్ ఫామ్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులోని ఓ సన్నివేశంలో  ఈ ఫోటోను సెక్స్ వర్కర్ గా చూపుతూ  ఈ చిత్రం మేకర్స్ వినియోగించుకున్నారు అయితే . తన ఇన్స్ టా గ్రామ్ నుంచి దీన్ని లిఫ్ట్ చేశారని సాక్షి ఆరోపించింది. అసలు తన అనుమతి అవసరం లేదా అని కూడా ఆమె ప్రశ్నించింది.ఆమె వాదనతో జస్టిస్ పటేల్ ఏకీభవిస్తూ ఇది చట్టవిరుధ్దమే అవుతుందన్నారు. పైగా ఇది డిఫమేషన్ కిందికి కూడా వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒక వ్యక్తి అనుమతి పొందినతరువాతే ఆయా సన్నివేశాల్లో వారి ఇమేజీలను తీసుకోవలసి ఉంటుందని జస్టిస్ పటేల్ పేర్కొన్నారు. ఈ కారణంగా ‘వీ’ చిత్రం ఏ భాషలో ఉన్నా, సబ్ టైటిల్స్ తో సహా తొలగించాలని ఆయన ఆదేశించారు. ఈ సినిమా దర్శక నిర్మాతలు తమ ఈ చిత్రంలో ఈ నాటికీ సంబంధించిన ఫోటోను తొలగించాలని, బ్లర్ కూడా చేయరాదని, అసలు ఈ నటికి సంబంధించిన సీక్వెన్స్ అంతటినీ కూడా డిలీట్ చేయాలని కోర్టు సూచించింది.  మరే ఇతర ప్లాట్ ఫామ్ లపై కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయరాదంటూ ఈ పిటిషన్ పై తదుపరి విచారణ ఈ నెల 8 న జరగాలని నిర్ణయించింది.

 

మరిన్ని ఇక్కడ చదవండి:

సంపన్నుల జాబితాలో హైదరాబాద్ ఫార్మా దిగ్గజాలు.. గ్లోబల్ బిలియనీర్ క్లబ్‌లో 10 మందికి చోటు.. ఎవరెవరంటే..

YS Sharmila Political Party: వైఎస్ షర్మిలతో భేటీ.. సంచలన ప్రకటన చేసిన కాంగ్రెస్ నాయకురాలు..