చాలాకాలం గ్యాప్ తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు హీరో శివాజీ. మొన్నటివరకు బిగ్‌బాస్ సీజన్ 7 తెలుగు రియాల్టీ షో ద్వారా అడియన్స్ ను అలరించాడు. మైండ్ గేమ్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘#90’s’. ఈ సిరీస్ ద్వారా ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు శివాజీ. ఇందులో వాసుకి ఆనంద్ సాయి కీలకపాత్రలో నటించగా.. నవీన్ మేడారం దర్శకత్వం వహించారు. ‘#90’s’. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’అనేది ఈ సిరీస్ ట్యాగ్ లైన్. ప్రతి మధ్య తరగతి కుటుంబాన్ని ప్రతిబింబించే ఈ సిరీస్‌ను ఎంఎన్ఓపీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజశేఖర్ మేడారం నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సిరీస్ ఓటీటీలోకి ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది.
మధ్యతరగతి కుటుంబ భావోద్వేగాలతో నవ్వులు పూయిస్తూ.. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సిరీస్ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ వేదికగా ఈటీవీ విన్ లో గత అర్దరాత్రి నుంచి ప్రసారం అవుతుంది. ఈ సిరీస్ మొత్తం ఆరు ఎపిసోడ్స్ గా తెరకెక్కించారు. చంద్రశేఖర్ (శివాజీ) అనే వ్యక్తి సాధారణ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. అతడికి ఇద్దరు కుమారులు, ఏకైక కుమార్తె ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి అనే గ్రామంలోని మధ్యతరగతి కుటుంబకథగా తెరకెక్కించారు. ప్రతి ఎపిసోడ్ విభిన్న భావోద్వేగాలు, మాజిక ఒత్తిడి, నమ్మకాలు, భారతదేశంలోని మధ్యతరగతి కుటుంబాల ఆదర్శాలతో వ్యవహరిస్తుంది.
#90s IS OUT ON @etvwin♥️
ITS ALL YOURS NOW!👇https://t.co/NUJwYo6iRE pic.twitter.com/qAplcBf5cR— Mouli Talks (@Mouli_Talks) January 4, 2024
ఇందులో శివాజీ భార్య పాత్రలో వాసుకి కనిపించనుంది. ఆమె గతంలో పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమాలో పవన్ కు చెల్లెలుగా కనిపించింది. యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయిన మౌళి తనూజ్ శివాజీ కొడుకుగా కనిపించనున్నాడు. శివాజీ మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాతో నటుడుగా కెరీర్ ఆరంభించాడు. ఆ తర్వాత హీరోగా మిస్సమ్మ, అమ్మాయి బాగుంది, మంత్ర సినిమాల్లో నటించారు.
Meeru mee kutumbham tho kalsi chudandi Shekhar mariyu athani Kutumbha Katha #90’s – A Middle Class Biopic webseries…😃🦋
First Episode FREE!🤩
Streaming now😎#ETVWin #90’s #WinThoWinodham @mouli_talks @MNOPRODUCTIONS @az_dop @Gnaadikudikar… pic.twitter.com/qNKf4KB2Iq— ETV Win (@etvwin) January 4, 2024
This children’s day, let’s remember the memories we made. No matter how old we get, some stories will forever be with us. Here is a trip down the memory lane, with the kids of #90’s. pic.twitter.com/W0weUGxjCj
— MNOP (@MNOPRODUCTIONS) November 14, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.