Daaku Maharaaj OTT: బాలయ్య ఫ్యాన్స్ గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి డాకు మహారాజ్.. ఎక్కడ చూడొచ్చంటే?

ఆఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా జనవరి 12 న థియేటర్లలో విడుదలైన ఈ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తద్వారా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Daaku Maharaaj OTT: బాలయ్య ఫ్యాన్స్ గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి డాకు మహారాజ్.. ఎక్కడ చూడొచ్చంటే?
Daaku Maharaaj Movie

Updated on: Feb 20, 2025 | 5:00 PM

నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. కొల్లి బాబీ అలియాస్ కే.ఎస్. రవీంద్ర తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఓవరాల్ గా ఈ మూవీ రూ. 160 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి నట్టు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. . థియేటర్లలో బాలయ్య అభిమానులకు పూనకాలు తెప్పించిన డాకు మహారాజ్ ను ఓటీటీలో కూడా చూద్దామని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడనుంది. మరికొన్ని గంటల్లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి రానుంది. డాకు మహారాజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈనెల 21 నుంచి బాలయ్య సినిమాను స్ట్రీమింగ్‌ కు తీసుకురానున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచే బాలయ్య మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుందన్నమాట.

 

ఇవి కూడా చదవండి

డాకు మహారాజ్ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రల్లో మెరిశారు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా ఆకట్టుకున్నాడు. వీరితో పాు సచిన్ ఖేడ్ కర్, హిమజ, వీటివి గణేష్, ఆడుకలం నరేన్, షైన్ టామ్ చాకో, మకరంద్ దేశ్ పాండే, సందీప్ రాజ్, బిగ్ బాస్ దివి, రిషి, రవికిషన్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు.సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, నాగసౌజన్య తెరకెక్కించిన డాకు మహారాజ్ సినిమాకు ఎస్ ఎస్ తమన్ స్వరాలు సమకూర్చారు.

ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే నెట్ ఫ్లిక్స్ లో డాకు మహారాజ్..

మరి థియేటర్లలో డాకు మహారాజ్ సినిమాను మిస్ అయ్యారా? లేదా బాలయ్య మాస్ హంగామానూ మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయండి.. ఎంచెక్కా ఇంట్లోనే డాకు మహారాజ్ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి