Love Me OTT: ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్.. లవ్ మీ ఎక్కడ చూడొచ్చంటే..

రొమాంటిక్ హారర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా మే 25న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో వైష్ణవి, అశీష్ తమ నటనతో మెప్పించినా.. హారర్ ఎలిమెంట్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం.. కథలో కన్ఫ్యూజన్ ఉండడంతో కాస్త నిరాశ పరిచింది. ఈ మూవీలో రవికృష్ణ, సిమ్రాన్ చౌదరి కీలకపాత్రలు పోషించగా.. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.

Love Me OTT: ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్.. లవ్ మీ ఎక్కడ చూడొచ్చంటే..
Love Me Movie

Updated on: Jun 14, 2024 | 2:30 PM

ఇటీవల థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాల్లో లవ్ మీ ఒకటి. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వారసుడు ఆశీష్ హీరోగా నటించిన రెండో సినిమా ఇది. ఇందులో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య కథానాయికగా నటించింది. ఇటీవలే బేబీ వంటి బ్లాక్ బస్టర్ వంటి సినిమాతో హీరోయిన్‏గా మం..చి క్రేజ్ అందుకున్న వైష్ణవి.. మరోసారి లవ్ మీ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. రొమాంటిక్ హారర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా మే 25న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో వైష్ణవి, అశీష్ తమ నటనతో మెప్పించినా.. హారర్ ఎలిమెంట్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం.. కథలో కన్ఫ్యూజన్ ఉండడంతో కాస్త నిరాశ పరిచింది. ఈ మూవీలో రవికృష్ణ, సిమ్రాన్ చౌదరి కీలకపాత్రలు పోషించగా.. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో శుక్రవారం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ముందస్తు హాడావిడి లేకుండా ఈ మూవీని ఓటీటీలో విడుదల చేస్తూ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసింది. ఇన్నాళ్లు థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు నేరుగా ఇంట్లోనే చూసేయ్యొచ్చు. లవ్ మీ చిత్రాన్ని దిల్ రాజు కూతురు హన్షితతో కలిసి హర్షిత్ రెడ్డి నిర్మించగా.. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.

లవ్ మీ కథ…
అర్జున్.. (అశీష్) దెయ్యాలు లేవు అంటూ నిరూపించే డేరింగ్ వీడియోస్ చేస్తూ యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలోనే అతడికి దివ్యవతి అనే దెయ్యం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. ఆమెను చూసిన ఎవరూ ప్రాణాలతో తిరిగి రాలేదని కథలు వింటాడు. అన్నయ్య ప్రతాప్ (రవికృష్ణ)తో కలిసి దివ్యవతి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో అతడి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి..? అర్జున్, ప్రియ (వైష్ణవి)కి ఉన్న బంధమేంటీ ? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.