Tantra OTT: అఫీషియల్.. ఆహాలో అనన్య నాగళ్ల హారర్ మూవీ ‘తంత్ర’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

|

Mar 31, 2024 | 5:08 PM

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల నటించిన లేటెస్ట్ సినిమా తంత్ర. శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కించిన హర్రర్ థ్రిల్లర్ లో ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ ముఖ్య పాత్రలు పోషించారు. టీజర్స్, ట్రైలర్‌ తోనే భయపెట్టించిన తంత్ర మార్చి 15న థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబట్టింది

Tantra OTT: అఫీషియల్.. ఆహాలో అనన్య నాగళ్ల హారర్ మూవీ తంత్ర.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Tantra Movie
Follow us on

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల నటించిన లేటెస్ట్ సినిమా తంత్ర. శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కించిన హర్రర్ థ్రిల్లర్ లో ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ ముఖ్య పాత్రలు పోషించారు. టీజర్స్, ట్రైలర్‌ తోనే భయపెట్టించిన తంత్ర మార్చి 15న థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబట్టింది. సినిమాలో హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయని రివ్యూలు వచ్చాయి. థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టిన తంత్ర అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో థియేటర్లలో రిలీజైన 20 రోజులకే తంత్ర సినిమా ఓటీటీలోకి రానుంది. ఏప్రిల్ 5 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా. ‘తంత్రం మంత్రం కుతంత్రం’, ‘ఆహా అందిస్తోన్న మరో హారర్ చిత్రం’ అంటూ తంత్రం ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు పోస్టర్ ను షేర్ చేసింది ఆహా.

ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్లపై నరేష్ బాబు పి, రవిచైతన్య సంయుక్తంగా తంత్ర సినిమాను నిర్మించారు. మనోజ్ ముత్యం, శరత్ బరిగెలా, కుషాలినీ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. రేఖ (అనన్య నాగళ్ల) పుట్టుక‌తోనే త‌ల్లి రాజ్య‌ల‌క్ష్మిని (స‌లోని) కోల్పోతుంది. నాన్నమ్మ సంరక్షణలో ఉంటుంది. తేజూ (ధనుష్ రఘుముద్రి)ను ప్రేమిస్తుంది. అయితే తేజూ వేశ్య కొడుకు కావ‌డంతో వారి ప్రేమ‌కు అడ్డంకులు ఎదుర‌వుతుంటాయి. మరోవైపు రేఖ చుట్టూ ఎప్పుడూ ద‌య్యాలు తిరుగుతుంటాయి. పౌర్ణ‌మి వ‌చ్చిందంటే రేఖ‌ను వెతుక్కుంటూ ఓ ర‌క్త పిశాచి వ‌స్తుంటుంది. అందుకు కార‌ణం ఏమిటి? క్షుద్ర శ‌క్తుల బారి నుంచి రేఖ ఎలా బ‌య‌ట‌ప‌డింది? తేజాతో తన ప్రేమను గెలిపించుకుందా? లేదా? అన్నదే తంత్ర సినిమా కథ.

ఇవి కూడా చదవండి

ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.