
చిన్న సినిమాలైనా, పెద్ద చిత్రాలైనా థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తుంటాయి. అయితే ఇప్పుడు అలాంటి దేమీ కనిపించలేదు. చాలా సినిమాలు నెలరోజుల్లోపే ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. మరికొన్ని చిత్రాలు మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. ఇక కొన్ని సినిమాలు అయితే చడీచప్పుడు లేకుండా సైలెంట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా గురువారం (డిసెంబర్ 11) ఓటీటీలోకి సడెన్‌గా ఓ తెలుగు మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. మరీ సూపర్ హిట్ రేంజ్ లో కాకపోయినా ఆడియెన్స్ ను ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ప్రజెంట్ మూవీ ట్రెండ్ జానర్ అయిన హారర్ కు క్రైమ్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు. సుమారు 2 గంటల ఐదు నిమిషాల రన్‌టైమ్‌తో తెరకెక్కిన ఈ సినిమా తల్లికూతురు జంట హత్యల నేపథ్యంలో ఆసక్తికరంగా సాగుతుంది. ఆ హత్యలు ఎవరు చేశారు? వాటి వెనక ఉన్న ఉద్దేశమేంటి? అసలు హీరోకు హీరోయిన్ దెయ్యమై ఎందుకు కనిపించింది? చివరకు హీరో ఏం చేశాడు? తల్లీ కూతుళ్ల హత్యను ఎలా చేధించాడు. ఈజంట హత్యలకు ఉన్న రాజకీయ నేపథ్యమేంటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
హారర్ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్ తో సాగే ఈ సినిమా పేరు 12 ఏ రైల్వే కాలనీ. అల్లరి నరేష్ హీరోగా నటించాడు. కామాక్షి భాస్కర్ల కథానాయిక. పొలిమేర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనిల్ విశ్వనాథ్ కథా పర్యవేక్షణలో కొత్త దర్శకుడు నాని కాసరగడ్డ ఈ సినిమాను తెరకెక్కించాడు. హీరో హీరోయిన్లతోపాటు సాయి కుమార్, అనీష్ కురువిల్లా, జీవన్ కుమార్, హర్ష చెముడు, గెటప్ శ్రీను, సద్దాం తదితరులు కీలక పాత్రలు పోషించారు. హారర్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్, సస్పెన్స్, రొమాంటిక్, కామెడీ అంశాలతో తెరకెక్కిన 12ఏ రైల్వే కాలనీ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో చూడని వారు అల్లరి నరేష్ కోసం ఒకసారి ఈ మూవీని చూడొచ్చు.
The Absolute Thriller #12ARailwayColony is now streaming on @PrimeVideoIN ❤️🔥
Enjoy the chills and thrills with your family from the comfort of your home 💥
▶️ https://t.co/P8dmEXPMAu@allarinaresh #KamakshiBhaskarla @DrAnilViswanath @directornanik @srinivasaaoffl @RKushendar… pic.twitter.com/vVGxTjVv3Q
— Srinivasaa Silver Screen (@SS_Screens) December 11, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.