Raju Weds Rambai OTT: ఓటీటీలో ‘రాజు వెడ్స్ రాంబాయి’! హార్ట్ టచింగ్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించింది రాజు వెడ్స్ రాంబాయి. ఇప్పటికీ థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోన్న ఈ హార్ట్ టచింగ్ మూవీని ఓటీటీ లోనూ చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.

Raju Weds Rambai OTT: ఓటీటీలో రాజు వెడ్స్ రాంబాయి! హార్ట్ టచింగ్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Raju Weds Rambai Movie

Updated on: Dec 03, 2025 | 7:44 AM

రాజు వెడ్స్ రాంబాయి.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిన్న సినిమా పేరు బాగా విపిపిస్తోంది. కొత్త డైరెక్టర్ సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ స్టోరీ గురించి అందరూ తెగ మాట్లాడేసుకుంటున్నారు. ముఖ్యంగా యూత్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. వేణు ఊడుగుల నిర్మించిన ఈ ప్రేమకథా చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్విని రావు హీరో, హీరోయిన్లుగా నటించారు. వీరిద్దరికీ ఇదే మొదటి సినిమా అయినా ప్రాణం పెట్టి నటించారు. ఇక సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ విలన్ పాత్రలో బాగా భయపెట్టాడు. సినిమాలో అతని నటనే హైలెట్ అని చెప్పుకోవచ్చు. నవంబర్ 21న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతోంది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రూరల్ లవ్ స్టోరీ ఇప్పటికే రూ.14 కోట్ల కు పైగా కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు సాయిలు. కొత్త డైరెక్టర్ అయినా తన టేకింగ్, మేకింగ్ స్టైల్ తో అందరి దృష్టిని ఆకర్షించాబడీ యంగ్ డైరెక్టర్. కాగా ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. ఇదే నేపథ్యంలో చాలా మంది ఈ సినిమాను ఓటీటీలో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి కోసం ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. అయితే థియేట్రికల్ వెర్షన్ రిలీజైన 50 రోజుల తర్వాతే ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకురావాలని డీ ల్ కుదిరిందట. అంటే జనవరి రెండో వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట.

ఇవి కూడా చదవండి

దిల్ రాజుతో రాజు వెడ్స్ రాంబాయి టీమ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి