Agent OTT: ‘ఏజెంట్’ ఓటీటీ డేట్ వచ్చేసిందోచ్.. నెల కాకముందే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చునంటే?

అఖిల్ అక్కినేని, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'ఏజెంట్'. థియేటర్లలో విడుదలై వారం రోజులు కాకముందే.. ఈ సినిమా ఓటీటీ విడుదలపై అప్డేట్ వచ్చేసింది.

Agent OTT: ఏజెంట్ ఓటీటీ డేట్ వచ్చేసిందోచ్.. నెల కాకముందే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చునంటే?
Agent

Updated on: May 03, 2023 | 9:36 AM

అఖిల్ అక్కినేని, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. థియేటర్లలో విడుదలై వారం రోజులు కాకముందే.. ఈ సినిమా ఓటీటీ విడుదలపై అప్డేట్ వచ్చేసింది. అనుకున్న దానికంటే.. ముందుగానే స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా గత నెల 28వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి తెలిసిందే. ఇక మొదటి ఆట నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకుని.. ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. దీంతో ‘ఏజెంట్‌’ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందోనని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.

ముందుగా మే నెలాఖరున ఏజెంట్ ఓటీటీలోకి వస్తుందని అందరూ భావించారు. అయితే ఈ మూవీ అంతకంటే ముందుగానే ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‌లో మే 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సోనీ లివ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను మంచి ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. మరోవైపు ఏజెంట్ చిత్రానికి డిజాస్టర్ టాక్ రావడంతో.. మొదటి రోజు సోసోగానే కలెక్షన్లు రాబట్టగా.. రెండో రోజు నుంచి దారుణంగా పడిపోయాయి. కాగా, ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించగా.. వక్కంతం వంశీ కథను అందించాడు. సాక్షి వైద్య ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. మమ్ముట్టి, డినో మోరియా ప్రధాన పాత్రలు పోషించారు. ఇక హిప్ హాప్ టమిజా ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు.