
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో సౌతిండియన్ బ్యూటీ క్వీన్ త్రిష హీరోయిన్ గా నటించింది. పుష్ప సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమానూ రూపొందించడం, టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో రిలీజ్ కు ముందే ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రూ.250 కోట్లకు వరకు కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా ఈ మూవీలో ఏకే అలియాజ్ రెడ్ డ్రాగన్ అనే గ్యాంగ్‍స్టర్ గా అజిత్ నటన ఆడియెన్స్ ను మెప్పించింది. ఇక త్రిష అందచందాలు, ప్రియా ప్రకాశ్ వారియర్, అర్జున్ దాస్, ప్రభు, ప్రసన్న, సునీల్, జాకీ ష్రాఫ్ ల అభినయం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మే 8 నుంచి అజిత్ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే గురువారం అర్ధరాత్రి నుంచే ఈ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.
గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో ప్రసన్న, సునీల్, రెడిన్ కింగ్ స్లే, షైన్ టామ్ చాకో, టినూ ఆనంద్, షయాజీ షిండే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూర్చారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. పెద్ద అండర్ వరల్డ్ డాన్ అయిన ఏకే (అజిత్ ) తన ఫ్యామిలీ కోసం కొన్ని నేరాలపై అరెస్ట్ అయి చాలా కాలంగా జైల్లో ఉంటాడు. ఓ రోజు కుమారుడు విహాన్ తండ్రిని చూడాల్సిందే అని బలవంతం చేయడంతో జైల్లో ఉన్న ఏకే కుటుంబాన్ని కలవడం కోసం బయటకు వస్తాడు. అదే సమయంలో కొన్ని గ్యాంగులు ఏకే ఫ్యామిలీపై దాడికి పాల్పడుతాయి. కుమారుడు విహాన్ వాళ్లకు చిక్కుతాడు. మరి ఏకే తన కుమారుడిని ఎలా కాపాడుకున్నాడన్నదే ఈ సినిమా స్టోరీ. థియేటర్లలో మిస్సయిన వారు, అజిత్ ఫ్యాన్స్, యాక్షన్ సినిమా చూడాలనుకునే వారు ఈ సినిమాను చూసేయవచ్చు.
Game evadidhi aithe enti.. gelichedhi maathram ee King Maker🔥😎
Watch Good Bad Ugly now on Netflix in Tamil, Hindi, Telugu, Kannada and Malayalam#GoodBadUglyOnNetflix pic.twitter.com/gwAUGRx5p5— Netflix India South (@Netflix_INSouth) May 8, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .