సినీ ప్రియులకు 100 శాతం ఎంటర్టైన్మెంట్ అందిస్తూ డిజిటల్ రంగంలో దూసుకుపోతుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (Aha). సూపర్ హిట్ చిత్రాలు.. సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్.. గేమ్ షోలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా.. ఇప్పటివరకు కేవలం 299 రూపాయలతో సంవత్సరం పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సినీ ప్రియులకు ఆహా అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. వ్యూవర్స్‌ను మరింత పెంచుకునేందుకు సరికొత్త ప్లాన్ చేసింది. మూడు నెలల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను కేవలం రూ. 99 రూపాయలకే అందిస్తుంది. దీంతో ఆహాలోని సినిమాలు, వెబ్ సిరీస్, షోస్ అన్నీ చూసేయ్యొచ్చు. ఈ ఆఫర్ వ్యాలిడిటీ జూన్ 30 వరకు ఉంటుంది. రూ. 99లు పే చేసి ఆహాలో నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను మూడు నెలలు చూడొచ్చు.. ఆహాలో రైటర్, డీజే టిల్లు, భీమ్లా నాయక్, క్రాక్ వంటి హిట్ చిత్రాలు మాత్రమే కాకుండా.. తెలుగు ఇండియన్ ఐడల్, సర్కా్ర్ 2 షోలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది ఆహా.
This June, Get ready for non-stop Entertainment with blockbuster movies, your favourite stars and much more @ just 99 for 3 months ?#ahaAt99 #ahaNonstop pic.twitter.com/UGiKnFbcek
— ahavideoin (@ahavideoIN) June 1, 2022