
తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్ని సూపర్‌హిట్ సినిమాలు, థ్రిల్లింగ్ సస్పెన్స్ వెబ్ సిరీస్‌లను సినీ ప్రియులకు అందించింది. అలాగే అన్‌స్టాపబుల్ అంటూ టాక్‌షోలు, తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్ సింగింగ్ షోలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది.అలాగే సినిమాలు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఆహా. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆహా. వెరే లెవల్ ఆఫీస్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించనుంది ఆహా. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రీలోడెడ్ వెర్షన్ మే 1, 2025న ప్రీమియర్ కానుంది. ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ మొదటి సీజన్ మంచి విజయం సంధించింది. దాంతో ఇప్పుడు రీలోడెడ్ వెర్షన్ ను తీసుకురానున్నారు. ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్‌లు ప్రారంభమవుతూ అదిరిపోయే కంటెంట్‌ను అందించనుంది ఆహా.
వెరే లెవల్ ఆఫీస్ (VLO) రీలోడెడ్ ఆసక్తికర కంటెంట్ తో అలరించనుంది.. ఈ సిరీస్ లో కామెడీ, ఎమోషన్స్ అన్ని ఉండనున్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేత నిఖిల్ వెరే లెవల్ ఆఫీస్ (VLO) రీలోడెడ్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. నిఖిల్ ఎంట్రీతో ఈ వెబ్ సిరీస్ కు కొత్త ఆసక్తి క్రియేట్ అయ్యింది. పోలూరు ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహిస్తున్నారు. వెరే లెవల్ ఆఫీస్ వెబ్ సిరీస్ లో ఆఫీస్ జీవితంలో కనిపించే రోజువారీ గందరగోళం, కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
మే 1, 2025 నుండి ప్రసారం అయ్యే ఆహాలో వెరే లెవల్ ఆఫీస్ (VLO) రీలోడెడ్ యొక్క మొదటి ఎపిసోడ్‌ను అస్సలు మిస్ అవ్వకండి. ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్‌లను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతుంది ఆహ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి