Gangubai In OTT: కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో సినిమా రంగం కూడా ఒకటి. రూ. కోట్ల బిజినెస్ జరిగే ఫిల్మ్ ఇండస్ట్రీ కంటికి కనిపించని వైరస్ కారణంగా చతికిల పడింది. గతేడాది లాక్‌డౌన్ సమయంలో థియేటర్లు మూతపడడం, షూటింగ్ ఆగిపోవడంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. అయితే కేంద్ర ప్రభుత్వం కరోనా సడలింపులను సడలించడంతో మళ్లీ థియేటర్లు ఓపెన్ అయ్యాయి. సినిమా షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి.
ఇదిలాఉంటే ఇప్పుడు మళ్లీ గతేడాది పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ షూటింగ్‌లు ఆగిపోతున్నాయి. నటీనటులు కరోనా బారిన పడుతుండడంతో కొన్నిసినిమాలు షూటింగ్ వాయిదా వేసుకున్నాయి. ఇక కొన్నిరాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు విధిస్తుండడంతో సినిమాల విడుదలలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. గతేడాది చిత్ర నిర్మాతలు సినిమాల విడుదల కోసం ఓటీటీ బాట పట్టినట్లే.. ఈసారి కూడా అదే దారిలో వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగులో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన దృశ్యం2 ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆలియా భట్ టైటిల్ రోల్‌లో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘గంగూబాయి కతియావాడి’ని ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో ముంబయిలో థియేటర్లు మూసివేయంతో చిత్ర యూనిట్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి దీనిపై ఓ క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Also Read: అది లోక కల్యాణం.. భక్తకోటికి చూసి తరించాల్సిన అద్భుతమైన ఘట్టం.. ఆ మహోత్సవాన్ని చూసే భాగ్యం కొందరికే!
Horoscope Today: ఈ రాశుల వారికి నూతన ఉద్యోగాలు.. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి.. ఈరోజు రాశిఫలాలు