Shruti Haasan: అమెజాన్ ప్రైమ్‏లో బెస్ట్ సెల్లర్ సిరీస్.. కీలకపాత్రలో శ్రుతి హాసన్..

|

Jan 29, 2022 | 11:43 AM

కమల్ హాసన్ నట వారసురాలిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రుతి హాసన్. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ

Shruti Haasan: అమెజాన్ ప్రైమ్‏లో బెస్ట్ సెల్లర్ సిరీస్.. కీలకపాత్రలో శ్రుతి హాసన్..
Best Seller
Follow us on

కమల్ హాసన్ నట వారసురాలిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రుతి హాసన్ (Shruti Haasan). అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మూవీ అనంతరం శ్రుతికి టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వచ్చాయి. స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంటూ టాప్ హీరోయిన్‏గా కొనసాగుతుంది. చాలా కాలం గ్యాప్ తర్వాత ఇటీవల క్రాక్ సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చింది ఈ అమ్మడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ మూవీలో నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. శ్రుతి హాసన్ ఇప్పుడు ఓ వెబ్ సిరీస్‏లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‏కు బెస్ట్ సెల్లర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రలో ముక్కల్ అభ్యంకర్ ఈ వెబ్ సీర్స తెరకెక్కించారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా ఈ సిరీస్‏ను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ రిలీజ్డేట్ ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 18న ఈ వెబ్ సిరీస్‎ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్‏ను కూడా రిలీజ్ చేశారు. రవి సుబ్రమణియన్ నవల ది బెస్ట్ సెల్లర్ ఆధారంగా దీనిని రూపొందించారు. ఇందులో సూపర్ స్టార్ నవలా రచయితగా మిథున్ చక్రవర్తి .. ఆయన ప్రేయసిగా శ్రుతి హాసన్ నటిస్తున్నారు.

Also Read: Samantha: పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

Gangubai Kathiawadi: థియేటర్లలోకి గంగూబాయి కతియావాడి.. అలియా భట్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్లు మీకు జోహార్లు రిలీజ్ అయ్యేది అప్పుడే.. విడుదల తేది ప్రకటించిన చిత్రయూనిట్..

Janhvi Kapoor: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి తనయ.. ఏ సినిమాతో అంటే..