
పురాణాలు, మనస్తత్వశాస్త్రం ఆధారంగా చేసుకుని వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా మాత్రం అందుకు విభిన్నం. సాధారణంగా మనమందరం రామాయణం నుంచి అహల్య కథ విన్నాము. ఆ కథను ఆధారంగా చేసుకుని రూపొందించిన థ్రిల్లర్ మూవీ ఇది. క్లైమాక్స్ చూస్తుంటే మీకు చెమటలు పడతాయి. ఈ సినిమా పేరు ‘అహల్య’. 2015 లో విడుదలైన ఒక ఉత్కంఠభరితమైన షార్ట్ ఫిల్మ్. ఇది కేవలం 14 నిమిషాల నిడివి ఉన్నప్పటికీ ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఈ చిత్రానికి ‘కహానీ’, ‘బద్లా’ వంటి చిత్రాల దర్శకుడు సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు.
రామాయణంలో అందమైన స్త్రీ అయిన అహల్యను ఇంద్రుడు మోసగించడం.. అటు గౌతమ మహర్షి శపించడం తెలిసిందే. ఈ కథ మనకు తెలుసు. కానీ ఈ లఘు చిత్రంలో, అదే పేర్లను ఉపయోగించి, ఒక కథను ఆధునిక యుగంలో, వేరే శైలిలో తెరకెక్కించారు. ఈ కథలో, ఇంద్రుడు ఒక పోలీసు అధికారి, అతను తప్పిపోయిన వ్యక్తి కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు ఒక సీనియర్ యాక్టర్ గౌతమ్ ఇంటికి వస్తాడు. అక్కడ అతడి అందమైన భార్య అహల్యను కలుస్తాడు. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందనేది సస్పెన్స్. ఒక ప్రత్యేక రాయిలో మాయాజాలం ఉందని, దానిని తాకిన వెంటనే వేరొకరి రూపాన్ని పొందవచ్చని గౌతమ్ ఇంద్రుడికి చెబుతాడు. ఇంద్రుడు ఈ ప్రయోగాన్ని ఆసక్తిగా ప్రయత్నిస్తాడు. ఆతర్వాత వచ్చే ట్విస్టులు ప్రేక్షులను షాక్ కు గురిచేస్తాయి.
ఈ షార్ట్ ఫిల్మ్ లోని ప్రతి సన్నివేశం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. చివరి సన్నివేశం మాత్రం మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. ఇందులో రాధికా ఆప్టే ప్రధాన పాత్ర పోషించింది. తోట రాయ్ చౌదరి పోలీస్ ఆఫీసర్ ఇంద్ర పాత్రలో నటించారు. సీనియర్ యాక్టర్ గౌతమ్ పాత్రలో సౌమిత్ర ఛటర్జీ నటించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..