ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్గా కాకుండా విలనిజంతో మెప్పిస్తోంది వరలక్ష్మీ శరత్ కుమార్. తమిళంతోపాటు.. తెలుగులో అనేక చిత్రాల్లో ప్రతి నాయకురాలి పాత్రలో తన అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంటుంది. అయితే ఇప్పటివరకు వెండితెరపై మెప్పించిన వరలక్ష్మీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై అలరించేందుకు సిద్ధమయ్యింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న వెబ్ సిరీస్ మాన్షన్ 24. మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా రాబోతున్న ఈ సిరీస్.. ఓ మాన్షన్ చుట్టూ అల్లుకున్న హారర్ స్టోరీ. దీనిని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ నిర్మించగా.. యాంకర్ ఓంకార్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవల విడుదల చేసిన వరలక్ష్మి పోస్టర్ ఆసక్తిని పెంచేసింది.
త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఇందులోని మెయిన్ పాత్రలకు సంబంధించిన ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తూ సిరీస్ పై మరింత క్యూరియాసిటిని పెంచేస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ నుంచి అవికా గోర్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. రక్తంతో తడిసిన ఒక వెపన్ పట్టుకుని కసితో కూడిన చూపులతో కనిపిస్తోంది అవికా. ఆమె కళ్లల్లోనూ రక్తం కనిపిస్తుంది. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ సిరీస్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇందులో అవికా గోర్ బింధుమాధవి, మీనా కుమారి, విధ్యుల్లేఖ రామన్, అభినయ, తులసి, రావు రమేశ్, సత్యరాజ్, రాజీవ్ కనకాల కీలకపాత్రలు పోషిస్తున్నారు.
The blood has a story to tell. Are you ready to listen? #Mansion24 Coming Soon, only on @DisneyPlusHSTel#Mansion24OnHotstar#Ohmkar @varusarath5 @avika_n_joy @thebindumadhavi @vidyuraman @ActorNandu #MeenaKumari @ActorMaanas @actor_amardeep @shraddhadangara @jois_archie… pic.twitter.com/mii3W7j7GS
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 22, 2023
మాన్షన్ 24 తెలుగులో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఎన్నో హారర్ సిరీస్ అందించిన హాట్ స్టార్.. ఇప్పుడు మరో కొత్త మిస్టరీ హర్రర్ థ్రిల్లర్ సిరీస్ జాబితాలో ఈ మాన్షన్ 24ను స్ట్రీమింగ్ చేయనుంది. రాజు గారి గది, రాజు గారి గది 2 చిత్రాలతో ప్రేక్షకులను నవ్వించి భయపెట్టిన ఓంకార్.. ఇప్పుడు మరోసారి టెన్షన్ పెట్టేందుకు రెడీ అయ్యారు. ఈ సిరీస్ ట్రైలర్ తోపాటు.. స్ట్రీమింగ్ తేదీని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
The moon and #Mansion24 – watch both at your own risk ⚠️#HotstarSpecials #Mansion24 coming soon. #Mansion24OnHotstar@varusarath5 @avika_n_joy @Bindhu_Madhavii @vidyuraman @ActorNandu pic.twitter.com/Mcc36M5yaM
— Disney+ Hotstar (@DisneyPlusHS) September 18, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.