RRR OTT: ఇక ఓటీటీ వంతు.. డిజిటల్‌ స్క్రీన్‌పై ట్రిపులార్‌ సందడి చేసేది ఆ రోజే.. ఎప్పుడు, ఎక్కడా.?

|

Apr 21, 2022 | 3:17 PM

RRR OTT: ఇండియన్‌ సిల్వర్‌పై ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR), మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోలుగా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా..

RRR OTT: ఇక ఓటీటీ వంతు.. డిజిటల్‌ స్క్రీన్‌పై ట్రిపులార్‌ సందడి చేసేది ఆ రోజే.. ఎప్పుడు, ఎక్కడా.?
Rrr Movie
Follow us on

RRR OTT: ఇండియన్‌ సిల్వర్‌పై ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR), మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోలుగా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టి మరోసారి తెలుగు సినిమా స్థాయిని మరోసారి భారతదేశానికి చాటి చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 1000 కోట్లకుపైగా రాబట్టి వసూళ్ల సునామి సృష్టించింది. ఇదిలా ఉంటే మొన్నటి వరకు థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఎప్పుడన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. వెండి తెరపై చూసిన ప్రేక్షకులు సైతం మరోసారి డిజిటల్‌ స్క్రీన్‌పై సినిమా చూసేయాలనే ఆతృతతో ఉన్నారు.

గతకొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీ విడుదలపై వార్తలు షికార్లు చేస్తున్నాయి. నిజానికి ఈ మధ్య కాలంలో విడుదలైన దాదాపు అన్ని చిత్రాలు వీలైనంత తక్కువ సమయంలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాయి. కానీ ట్రిపులార్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గకపోవడం, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడంతో ఓటీటీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను జూన్‌ 3 నుంచి ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. తెలుగు వెర్షన్‌ను జీ5లో కాగా, హిందీ సహా విదేశీ భాషల వెర్షన్స్‌ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు సమాచారం. ఇలా ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాల్లో రెండున్నర నెలల తర్వాత ఓటీటీలోకి రానున్న చిత్రంగా ట్రిపులార్‌ అరుదైన రికార్డు దక్కించుకోనుంది. మరి ట్రిపులార్‌ జూన్‌ 3న నిజంగానే రానుందా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Vellampalli Srinivas: మాజీ మంత్రి వెల్లంపల్లికి కొత్త ఛాలెంజ్.. ఆ ఇద్దరు నేతలు సహకరిస్తారా? చుక్కలు చూపిస్తారా?

Mangoes: చేదెక్కుతున్న మధుర ఫలం.. ధరలోనే కాదు, రుచిలోనూ మోసమే

Plane Crash: హైతిలో సోడా బాటిళ్ల ట్రక్కును ఢీ కొన్న చిన్న విమానం.. ఐదుగురు మృతి.. ప్రధాని సంతాపం