Mithila Palkar: విశ్వక్‌ అలా పిలిచినప్పుడల్లా నవ్వొచ్చేది.. మిథిలా పాల్కర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

|

Dec 04, 2022 | 10:49 AM

ఓరి దేవుడా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార మిథిలా పార్కర్‌. తొలి సినిమాతోనే తనదైన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిందీ ముంబై ముద్దుగుమ్మ. కేవలం నటిగానే కాకుండా గాయనిగా, రచయిత్రిగా కూడా మిథిలా మంచి పేరును సంపాదించుకుంది. ఈ సినిమా విజయంతో..

Mithila Palkar: విశ్వక్‌ అలా పిలిచినప్పుడల్లా నవ్వొచ్చేది.. మిథిలా పాల్కర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..
Mithila Palkar
Follow us on

ఓరి దేవుడా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార మిథిలా పార్కర్‌. తొలి సినిమాతోనే తనదైన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిందీ ముంబై ముద్దుగుమ్మ. కేవలం నటిగానే కాకుండా గాయనిగా, రచయిత్రిగా కూడా మిథిలా మంచి పేరును సంపాదించుకుంది. ఈ సినిమా విజయంతో ఒక్కసారిగా ఈ ముద్దుగుమ్మ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ఆఫర్లు వెతుక్కుంటూ మరి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన మిథిలా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఓరి దేవుడా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల అభిమానం పొందడం చాలా సంతోషంగా ఉందని తెలిపిన మిథిలా.. విశ్వక్‌సేన్‌ ‘పొట్టి నూడుల్స్‌’ అని పిలిచిన ప్రతిసారీ తెగ నవ్వొచ్చేదని తెలిపింది. టాక్‌ షోలు, టెలివిజన్‌ కార్యక్రమాలు, సోషల్‌ మీడియా ద్వారా కూడా నేను చాలామందిని పలకరిస్తానని చెప్పుకొచ్చింది. ఇక ఒకప్పటితో పోలిస్తే ఈ సమయం హీరోయిన్లకు స్వర్ణయుగమని చెప్పింది మిథిలా.. హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేయగలిగే స్థాయికి హీరోయిన్లు ఎదిగారు అని తెలిపింది.

తన జీవితంలో సోషల్‌ మీడియాలో ప్రత్యేక స్థానం ఉందని తెలిపిన మిథిలా.. మనం అందించే కంటెంట్‌ను బట్టే అభిమానులు మనల్ని ఆదరిస్తారని నమ్ముతానని చెప్పుకొచ్చింది. ఎలాంటి భేదం లేకుండా అందరినీ ఒకే వేదికపై నిలిపే సోషల్‌ మీడియా ఈతరానికి బాగా దగ్గరైందని తెలిపిన మిథిలా.. తన కెరీర్‌ మొదలైంది కూడా ఇక్కడే అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..