Mahesh Babu: మహేష్ బాబు సినిమాల్లోనే కాదు చిన్నారుల ప్రాణాలకు కాపాడుతూ నిజ జీవితంలోనూ హీరోనే అనిపించుంటారు. మహేష్ బాబు ఫౌండేషన్ (Mahesh Babu Foudation) పేరుతో ఎంతో మంది చిన్నారులకు గుండె సంబంధిత శస్త్రచికిత్సలు చేయిస్తూ అండగా నిలుస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ఆసుపత్రులతో భాగస్వామ్యమై ఆపరేషన్స్‌ను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సం (ఏప్రిల్ 7) సందర్భంగా ఒకేసారి ఏకంగా 30 మందికి శస్త్ర చికిత్సలు చేయించి వారి ప్రాణాలను నిలబెట్టారు.
విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్‌లో మహేష్ బాబు ఫౌండేషన్ సహాయంతో 30 మందికి గుండె ఆపరేషన్లను నిర్వహించారు. ఈ విషయాన్ని మహేష్ సతీమణి నమ్రతా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన నమ్రతా.. ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా 30 మందికి గుండె సంబంధిత సర్జరీని నిర్వహించాము. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనికి సహకరించిన ఆంధ్ర హాస్పిటల్స్ వారికి కృతజ్ఞతలు’ అంటు రాసుకొచ్చారు.
ఇదిలా ఉంటే మహేష్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నారు ప్రిన్స్. ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉండగా.. ఇది పూర్తికాగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా, రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు మహేష్.
Also Read: ఎగిసిపడుతున్న సముద్రపు అలల తాకిడిలో అందాల ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్..
Smart Watches: స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా.? బడ్జెట్ ధర, బెస్ట్ ఫీచర్ వాచ్‌లు ఇవే..