- Telugu News Photo Gallery Technology photos Are you searching for a smart watch. Here the best smartwatch under 2500
Smart Watches: స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా.? బడ్జెట్ ధర, బెస్ట్ ఫీచర్ వాచ్‌లు ఇవే..
Smart Watches: స్మార్ట్ వాచ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా.? మార్కెట్లో అందుబాటులో ఉన్న వాచ్‌లలో ఏది కొనుగోలు చేయాలో అర్థం కావడం లేదా.? అయితే తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్ వాచ్‌ల వివరాలు మీకోసం...
Updated on: Apr 08, 2022 | 10:03 AM

ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ వాచ్‌ల హవా నడుస్తోంది. రోజుకో కొత్త స్మార్ట్ వాచ్ మార్కెట్లో సందడి చేస్తున్న తరుణంలో ఏ వాచ్‌ను తీసుకోవాలనే సందేహం అందిరలోనూ ఉంటుంది. తక్కువ ధరలో, మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్ వాచ్‌లపై ఓ లుక్కేయండి..

BoAt Watch Mercury: ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు పెట్టింది పేరైన బోట్ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ వాచ్ రూ. 1,999కి అందుబాటులో ఉంది. బాడీ టెంపరేచర్, ఐపీ68 స్వెట్, డస్ట్ రెసిస్టెన్స్ ఈ వాచ్ ప్రత్యేకత. మహిళల కోసం ఇందులో ప్రత్యేకంగా ఋతు చక్రం ట్రాకర్ ఫీచర్ ఇందులో ఉంది. మొబైల్ ఫోన్‌కు వచ్చే కాల్, టెక్ట్స్, సోషల్ మీడియాలో నోటిఫికేషన్స్‌ను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు.

Noise ColorFit Qube O2: ఈ స్మార్ట్ వాచ్‌లో 1.4 ఇంచెస్ ఫుల్ టచ్ డిస్‌ప్లేను అందించారు. ఎస్‌పీఓ2, 24*7 హార్ట్ రేట్ మానిటరింగ్ ఈ వాచ్ ప్రత్యేకతలు. ఇందులో మొత్తం 8 రకలా స్పోర్ట్స్ మోడల్స్‌ను అందించారు. ధర విషయానికొస్తే రూ. 1,999కి అందుబాటులో ఉంది.

Fire-Boltt Ninja: తక్కువ ధరకు అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్‌లలో ఇదీ ఒకటి. ఇందులో టచ్ టు వేక్, లిఫ్ట్ టు వేక్ అనే ప్రత్యేక ఫీచర్‌ను అందించారు. ఎస్‌పీఓ2 మానిటర్, హెచ్‌ఆర్ మానిటర్, స్లీప్ ట్రాకర్, యాక్టివ్ స్పోర్ట్స్ మోడ్స్‌ను అందించారు. 1.3 ఇంచెస్ డిస్‌ప్లేతో రూపొందించిన ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 1,999కి అందుబాటులో ఉంది.

Dizo Watch 2 Sports: ఈ స్మార్ట్ వాచ్ రూ. 2,499కి అందుబాటులో ఉంది. 4.2 సీఎమ్ ఫుల్ టచ్ స్క్రీన్‌తో రూపొందించిన ఈ వాచ్‌లో 5 ఏటీఎమ్ వాటర్ రెసిస్టెంన్స్‌ను అందించారు. 110కిపైగా స్పోర్స్ మోడల్స్ ఈ వాచ్ సొంతం.

Realme TechLife Watch S100: రియల్‌మీ టెక్‌లైఫ్ వాచ్ ఎస్100 పేరుతో లాంచ్ చేసిన ఈ వాచ్ రూ. 2,249కి అందుబాటులో ఉంది. ఇందులో 1.69 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఈ వాచ్ సొంతం.




