Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మరికొన్ని గంటల్లో పండుగ మొదలు కానుంది. రేపు (శనివారం) ప్రభాస్ పుట్టిన రోజనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. బాహుబలి తర్వాత నేషనల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్‌పై ఇప్పుడు యావత్ ఇండియన్ సినీ లవర్స్ దృష్టి పడింది. ఈ క్రమంలోనే ఓవైపు ప్రభాస్ సంబరాలతో పాటు, డార్లింగ్ బర్త్‌డే సందర్భంగా ఆయన నటిస్తోన్న చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్స్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే రాధేశ్యామ్ చిత్రానికి సంబంధించి శనివారం టీజర్‌ను విడుదల చేస్తున్నారు.
ఇదిలా ఉంటే పుట్టిన రోజుకు ఒకరోజు ముందే ప్రభాస్ ఫ్యాన్స్‌ను రాధేశ్యామ్ టీమ్ సర్‌ప్రైజ్ చేసింది. కొత్త సినిమాలోని ప్రభాస్ మరో లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ చాలా కూల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ట్రావెలర్ బ్యాగ్‌తో ఏదో అడవిలో షికార్లు కొడుతున్నట్లు ఉన్న ఈ ఫోటో ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే ప్రభాస్ రాధేశ్యామ్‌లో విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తుండగా ఆయనకు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చూపు ఉంది. మరి రేపు విడుదల కానున్న టీజర్ నెట్టింట ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఈ ఫోటోలోని చిన్నారి అబ్బాయిలకు డ్రీమ్ గర్ల్.. ఎన్నో బ్లాక్‌బస్టర్స్ అందుకుంది.. ఎవరో తెలుసా.!