Official: ‘పెళ్లి సందD’లో రోషన్‌.. శ్రీకాంత్‌ని గుర్తుచేస్తోన్న వారసుడు

| Edited By:

Oct 28, 2020 | 9:14 AM

మూడేళ్ల గ్యాప్ తరువాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు 'పెళ్లిసందD' సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. 1996లో శ్రీకాంత్‌ హీరోగా తెరకెక్కించిన పెళ్లి సందడి ఘన విజయం కాగా

Official: పెళ్లి సందDలో రోషన్‌.. శ్రీకాంత్‌ని గుర్తుచేస్తోన్న వారసుడు
Follow us on

Roshan in PellisandaD: మూడేళ్ల గ్యాప్ తరువాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ‘పెళ్లిసందD’ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. 1996లో శ్రీకాంత్‌ హీరోగా తెరకెక్కించిన పెళ్లి సందడి ఘన విజయం కాగా.. ఇప్పుడు అదే టైటిల్‌తో మరోసారి రాఘవేంద్రరావు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌లో మొదటి నుంచి శ్రీకాంత్ తనయుడు రోషన్ పేరు వినిపిస్తుండగా.. తాజాగా అతడిని ఖరారు చేస్తూ, చిత్ర యూనిట్ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. అందులో రోషన్ స్టైలిష్‌ లుక్‌లతో ఆకట్టుకుంటుండగా.. యువకుడిగా ఉన్నప్పుడు శ్రీకాంత్‌ ఇలానే ఉండేవాడు అన్నట్లుగా కనిపిస్తున్నారు.

ఇక ఈ మూవీని కె కృష్ణ మోహన్ రావు, ఆర్కా మీడియా వర్క్‌ సమర్పిస్తుండగా.. ఆర్కే ఫిలిం అసోసియేషన్ నిర్మించనుంది. గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో హీరోయిన్‌గా దివంగత నటి శ్రీదేవీ చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌ని సంప్రదిస్తున్నట్లు సమాచారం.

Read More:

రాజమౌళికి ఎంపీ సోయం బాపురావు వార్నింగ్‌

మురళీధరన్‌ బయోపిక్‌: సేతుపతి కంటే ముందు ఆ స్టార్ హీరోను సంప్రదించారా..!